English   

పూరీని కొట్టించిన చిరు

Puri Jagannadh
2020-04-01 18:02:15

ఉగాది సందర్భంగా సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చాడు ఇక ట్విట్టర్ లో అయితే రెచ్చిపోయి ట్వీట్లు చేసేస్తున్నాడు. సెలెబ్రెటీలు పెట్టిన పోస్ట్ లకు కామెంట్ లు పెడుతూ ఎప్పుడు యాక్టివ్ గా ఉంటున్నారు. అయితే చిరు పూరి పోస్ట్ కి చేసిన కామెంట్ కి ఆయన చెంప పగలగొట్టిందట పూరీ భార్య. కరోనా కర్ఫ్యూ కారణంగా ముంబై, బ్యాంకాక్ బీచ్‌లను బాగా మిస్సవుతున్నా,  పిల్లలతో సమయం గడుపుతున్నందుకు వారు చాలా ఆనందపడుతూ ఉంటారని భావిస్తున్నాని చెబుతూ పూరీని ట్యాగ్ చేసిన కామెంట్ చేశాడు చిరు. ఎపుడు బీ‌‌చ్‌లు పట్టుకునే తిరిగే పూరీ కరోనా కారణంగా ఇంటికే పరిమితమయ్యాడని చెబుతూ కామెంట్ చేశారు. ఈ ట్వీట్ కారణంగా పూరీ జగన్నాథ్ భార్య పండు పూరీని చెంప దెబ్బ కొట్టినట్టు చెప్పుకొచ్చారు పూరీ జగన్నాథ్. అయితే ఆయన్ను భార్య కొట్టింది కోపంతో కాదు అండోయ్ సరదాగా. నిజానికి పూరీ చిరు కలయికలో ‘ఆటోజానీ’ సినిమాను అనౌన్స్ చేసారు. ఐతే ఎందుకో కానీ ఈ సినిమా స్క్రిప్ట్‌ ను పక్కనపెట్టారు. ప్రస్తుతం పూరి విజయ్ తో ఒక పాన్ ఇండియా మూవీ ని తెరకెక్కిస్తున్నారు. 

More Related Stories