English   

సీరియస్ గా రచ్చ లేపిన సేతుపతి

 Vijay Sethupathi
2020-04-01 18:18:33

మెగాస్టార్ చిరంజీవి చిన మేనల్లుడు వైష్ణవ్ తేజ్ పంజా హీరోగా రూపొందుతోన్న డెబ్యూ మూవీ ఉప్పెన. ఈ సినిమాకి సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు శానా దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థతో కలిసి సుకుమార్‌ రైటింగ్స్ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాలో తమిళ స్టార్‌ విజయ్‌ సేతుపతి కీలక పాత్ర పోషించబోతున్నట్లు చిత్ర బృందం గతంలోనే అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రంలో ఆయన విలన్‌గా చేయనున్నాడని ప్రచారం జరిగింది. ఈ ఉదయం ఈ సినిమాలో విజయ్‌ సేతుపతికి సంబంధించిన లుక్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ పోస్టర్‌లో ఆయన ఖద్దరు చొక్కా, పంచెకట్టు ధరించి ఓ చెక్క కుర్చీలో కాలుపై కాలు వేసుకోని సీరియస్‌ లుక్స్‌తో దర్శనమిచ్చారు. రాయనమ్‌ అనే ఊరి పెద్దగా విజయ్‌ నటన ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. ఇక ఈ సినిమాని గతేడాది చివర్లో అంటే డిసెంబర్ లో రిలీజ్ చేయాలని భావించారు. కానీ అది కుదరక పోవడంతో ఈ సినిమా రిలీజ్ సమ్మర్ హాలిడేస్ కి సినిమాని రిలీజ్ చేయాలనీ మేకర్స్ భావిస్తున్నట్టు ప్రచారం జరిగింది. కరోనా దెబ్బకు అది వెనక్కు వెళ్ళినా ఆశ్చర్యం లేదు.  

More Related Stories