English   

రష్మిక షాకింగ్ కామెంట్స్..నేను నేను రకుల్ లాంటి దాన్ని కాదు

Rashmika mandanna
2020-04-01 18:32:03

"యారియాన్" సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రకుల్ ప్రీత్ సింగ్ అక్కడ అవకాశాలు లేకపోవడంతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. తెలుగులో మొదట సందీప్ కిషన్ సరసన వెంకటాద్రి ఎక్సప్రెస్ లో నటించిన ఈ బ్యూటీ ఆ సినిమా హిట్ కావడం తో అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంది ఆ తరువాత పెద్ద సినిమాల్లో ఆఫర్ లు కొట్టేసిన రకుల్ అతి అతి తక్కువ కాలంలోనే కోటి రూపాయల పారితోషికం పుచుకుంది. టాలీవుడ్ లో రకుల్ దాదాపు టాప్ హీరోలందరి సరసన నటించే అవకాశం దక్కించుకుంది . మహేష్ బాబు , అల్లు అర్జున్, రాంచరణ్ ల సరసన నటించిన ఈ భామ మరో వైపు చిన్న సినిమాలకు ఓకే చెబుతూ వాటిలోనూ నటించేసింది. అయితే కొంత కాలంగా రకుల్ కు హిట్ లు లేకుండాపోయాయి. దాంతో ఈ బ్యూటీ డౌన్ ఫాల్ ని చూడాల్సి వచ్చింది. దానికి కారణం రకుల్ స్టోరీ సెలక్షన్ లో చేసిన మిస్టేక్స్ ఏ నట ..ఏ స్టోరీ కి అయినా ఓకే చెప్పటం తోనే రకుల్ కి ఆఫర్లు లేకుండా పోయాయని టాక్.

కాగా ప్రస్తుతం వరుస హిట్ లతో జోరుమీదున్న హీరోయిన్ రష్మిక మందన. ఈ భామ రకుల్ పై షాకింగ్ కామెంట్ లు చేసింది. రకుల్ లాగా అన్ని స్టోరీ లకు ఒకే చెప్పకుండా  కేవలం నచ్చినవాటికి పాత్రకు ప్రాధాన్యం ఉన్నవాటికే ఓకే చెబుతానంది. ఏడాది ప్రారంభంలోనే సూపర్ స్టార్ట్ తో హిట్ కొట్టిన రష్మిక "భీష్మ" విజయంతో మరిన్ని ఆఫర్ లు దక్కించుకుంది. ప్రస్తుతం అల్లుఅర్జున్, సుకుమార్ కంబినేషన్లో వస్తున్న సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఇక రష్మిక కేవలం స్టార్ హీరోల పక్కనే నటిస్తుందట అంతే కాకుండా ప్రస్తుతం ఫామ్ లో ఉన్న యంగ్ హీరోల సరసన నటిస్తుందట. రష్మిక కెరీర్ కోసం బాగానే ప్లాన్ లు వేసుకుంది గాని ఆమె జర్నీ టాలీవుడ్ లో ఎలా సాగుతుందో చూడాలి.      

More Related Stories