సూర్య హీరోయిన్ సూర్యుడికే చెమటలు పట్టిస్తుందిగా..

సూర్య హీరోయిన్ అంటే ఎంతోమంది ఉన్నారు కదా.. అంతమందిలో ఎవరని అనుకోవాలి అనుకుంటున్నారు కదా.. సూర్య అంటే హీరో సూర్య.. నిఖిల్ హీరోగా నటించిన సూర్య వర్సెస్ సూర్య హీరోయిన్ త్రిదాచౌదరి గురించి ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నది. ఈ భామకు తెలుగు ఇండస్ట్రీ అస్సలు కలిసిరాలేదు. పైగా కేరాఫ్ బాలీవుడ్ ఇక్కడ అవకాశాలు రాకపోయినా పెద్దగా పట్టించుకోవడం లేదు. కాకపోతే అవకాశాల కోసం అడిగినంత అందాలు అలా ధారబోస్తూ పిచ్చెక్కిస్తున్నారంతే. ఇప్పుడు కూడా త్రిదాచౌదరి ఇదే చేసింది. ఈ భామతో తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం కూడా అక్కర్లేదు. ఆ మధ్య నిఖిల్ సూర్య వర్సెస్ సూర్యలో నటించింది. మళ్లీ ఈ మధ్యే అనుకున్నదొక్కటి అయినదొక్కటి సినిమాలో సెకండ్ లీడ్ చేసింది. ఈ రెండు సినిమాల్లోనూ అందాల ఆరబోత ఓ రేంజ్ లో చేసింది త్రిదా. ఇక సందీప్ కిషన్ మనసుకు నచ్చిందిలో అయితే బికినీలతో రచ్చ రచ్చ చేసింది. ఈ సినిమాలు పెద్దగా ఆడలేదు దాంతో త్రిదాను ఎవరూ పట్టించుకోలేదు. కానీ తనను పట్టించుకునే వరకు.. దర్శక నిర్మాతల దృష్టిలో పడేవరకు ఏదో చేసేలా ఉంది త్రిదా. తాజాగా మరోసారి హాట్ ఫోటోషూట్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ఆ మధ్య బీచ్ లో అమ్మాయిగారు చేసిన రచ్చకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఇక ఇప్పుడు మరోసారి బికినీ కాకపోయినా క్లీవేజ్ షోతో మతులు చెడగొట్టే పనిలో బిజీగా ఉంది. మరి చూడాలిక.. ఈ అందాల ఆరబోత చూసిన తర్వాతైనా ఎవరో ఒకరు త్రిదాకు ఆఫర్ ఇవ్వకపోరూ..!