కంగనాతో సినిమా చేయనన్న బాలయ్య...అందుకేనా

నందమూరి బాలకృష్ణ మరోసారి తన తండ్రి నందమూరి తారక రామారావు పాత్రలో నటించనున్నారనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితాధారంగా బాలీవుడ్లో ‘తలైవి’ అనే బయోపిక్ తెరకెక్కుతుండగా జయలలిత పాత్రలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నటిస్తున్నారు. ప్రముఖ తమిళ దర్శకుడు ఏ.ఎల్ విజయ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ మొదలైపోయింది. అయితే ఇందులో నందమూరి తారక రామారావు, జయలలితలకు సంబంధించిన ఆసక్తికరమైన సన్నివేశాలను సినిమాలో చూపించనున్నారట. ఎన్టీఆర్, జయలలితల కాంబినేషన్లో ‘బాగ్దాదీ గజ దొంగ’, ‘ఆలీ బాబా 40 దొంగలు’, ‘కదలడు వదలడు’, ‘దేవుడు చేసిన మనుషులు’ ఇలా ఎన్నో సినిమాలు వచ్చాయి.
ఆ సినిమాల నేపధ్యంలో ఎన్టీఆర్ ను కూడా చూపించాలని భావిస్తున్నారని సమాచారం. ఈ సమయంలో ఎన్టీఆర్ పాత్ర కోసం బాలయ్యనే అడిగారని సమాచారం. ఎందుకంటే పైగా ఈ చిత్ర నిర్మాతల్లో విష్ణు ఇందూరి కూడా ఒకరు. ఈయన బాలయ్యతో కలిసి ఎన్టీఆర్ బయోపిక్ నిర్మించి నష్ట పోయాడు. ఈ క్రమంలో ఈ పాత్ర కోసం బాలయ్యనే సంప్రదించారట. అయితే ముందు ఒప్పుకున్నా బాలయ్య తాజాగా ఆ సినిమాని చేయనని చెప్పారట. అయితే ఇదివరకే తన తండ్రి బయోపిక్ గా కథానాయకుడు, మహానాయకుడు తీసి విఫలమైన బాలకృష్ణ ఈ సినిమా కూడా ఆడకుంటే బాగోదని చెప్పి తప్పుకున్నట్టు చెబుతున్నారు. చూడాలి మరి ఇందులో ఎంతవరకూ నిజం ఉందొ ?