English   

రామ్ గోపాల్ వర్మకు కరోనా.. ట్వీట్ చేసిన దర్శకుడు

RGV.jpg
2020-04-02 05:54:14

నమ్మడానికి కష్టంగా ఉంది కదా.. ఇదే నిజం మరి. రామ్ గోపాల్ వర్మే స్వయంగా తనకు కరోనా పాజిటివ్ ఉందని తెలిపాడు. అభిమానులకు తెలిసేలా ట్వీట్ కూడా చేసాడు. ఇప్పుడే మా డాక్టర్ ఫోన్ చేసి నీకు కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిపాడు అంటూ ట్వీట్ చేసాడు వర్మ. అది చూసి అభిమానులు కూడా షాక్ అయ్యారు. బయటికి కూడా వెళ్లలేదు కదా.. ఎవర్నీ కలవలేదు.. పైగా నువ్వే గత నాలుగైదు రోజులుగా చెబుతున్నావు.. జాగ్రత్తగా ఉండాలని అంతలోనే నీకెలా వచ్చింది వర్మ ఈ కరోనా అంటూ నెటిజన్స్ కూడా ఈయన్ని ప్రశ్నలు మొదలుపెట్టారు. అప్పుడు ఆయనలోని మరో సైకో నిద్ర లేచాడు. ఆ ట్వీట్ చేసిన 15 నిమిషాలకు మరో ట్వీట్ చేసి.. సారీ అందర్నీ డిసప్పాయింట్ చేసాను.. నాకు కరోనా లేదంట.. నా డాక్టర్ నన్ను ఎప్రిల్ ఫూల్ చేసాడు.. ఇది నా తప్పు కాదు ఆయనదే అనేసాడు. కరోనాతో కూడా కామెడీ చేస్తున్న వర్మను చూసి అంతా తిట్టుకుంటున్నారు. 

More Related Stories