English   

బాలకృష్ణ, మోహన్ బాబు విరాళం ఇవ్వకపోవడానికి కారణం అతడేనా..

chiru
2020-04-02 07:19:36

తెలుగు ఇండస్ట్రీలో చిన్న చిన్న హీరోలు కూడా కరోనా క్రైసిస్ చారిటీ కోసం తమకు తోచిన విరాళం అందించారు. కానీ సీనియర్ హీరోలు బాలకృష్ణ, మోహన్ బాబు మాత్రం ఇప్పటివరకు విరాళం ఊసే ఎత్తలేదు. ఈరోజు రేపు అనుకుంటే ఇప్పటికీ వీళ్ళ నుంచి ఎలాంటి స్పందన లేదు. కోట్లు సంపాదిస్తున్నారు ఎందుకు సినిమా కార్మికుల కోసం విరాళం ఇవ్వడం లేదు అంటూ చాలామంది సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు కూడా. దానికి తోడు మెగాస్టార్ చిరంజీవి కూడా రోజు ట్విట్టర్ లో మిగిలిన హీరోలను, నటీనటులను కూడా అడుగుతున్నాడు. కచ్చితంగా ఈ సమయంలో సినిమా కార్మికులకు ఆదుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది.. ప్రతి ఒక్కరు ముందుకు కదిలి వచ్చి ఎవరికి తోచిన విరాళం వాళ్ళు అందించండి అంటూ కోరుతున్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పటివరకు దాదాపు 6 కోట్ల 30 లక్షలు ఈ చారిటీలో వచ్చాయని ఆయన లెక్కలు కూడా చెబుతున్నాడు. అయితే బాలకృష్ణ, మోహన్ బాబు మాత్రం ఇప్పటివరకు విరాళం ఇవ్వకపోవడానికి కారణం మెగాస్టార్ చిరంజీవి అని ప్రచారం జరుగుతుంది.

కరోనా క్రైసిస్ చారిటీకి చిరంజీవి అధ్యక్షుడిగా ఉన్నాడు. ఇది ఇండస్ట్రీలో కొందరు సీనియర్ హీరోలకు నచ్చడం లేదని.. చిరంజీవి అధ్యక్షుడిగా ఉంటే తాము విరాళం ఇవ్వడానికి సిద్ధంగా లేము అంటూ కొందరు నిర్ణయం తీసుకున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. బాలకృష్ణ కూడా అందుకే ఇప్పటివరకు విరాళం విషయంలో స్పందించలేదని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రతి విషయంలో సాయం చేయడానికి ముందు ఉండే బాలకృష్ణ ఈ సారి మాత్రం వెనుకడుగు వేయడానికి కారణం చిరంజీవి అంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు. అయితే ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ఇప్పటివరకు బాలయ్య, మోహన్ బాబు విరాళం ఇవ్వకపోవడం.. చిరంజీవి అధ్యక్షుడిగా ఉండటం చూస్తూ ఉంటే ఏదైనా లింకు ఉందేమో అనే సందేహాలు కూడా వస్తున్నాయి. మరి ఇది అబద్దం అని ప్రూవ్ కావాలి అంటే బాలయ్య, మోహన్ బాబు విరాళం ప్రకటించాల్సిందే. మరి అది జరుగుతుందో లేదో చూడాలి.

More Related Stories