బన్నీ పుట్టిన రోజున టైటిల్ అనౌన్స్ చేస్తారట

మొన్న సంక్రాంతికి అల వైకుంఠపురంలో లాంటి హిట్ కొట్టిన తర్వాత బన్నీ డైరెక్టర్ సుకుమార్ దర్వకత్వంలో ఓ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే బన్నీ లేకుండానే సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకోగా రెండో షెడ్యూల్ షూట్ కి వెళ్ళాల్సి ఉంది. అయితే కరోనా దెబ్బతో యూనిట్ అంతా ఇంట్లోనే రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి. అయితే ఆయన ఇంట్లో ఖాళీగా కూర్చోకుండా ఈ సమయంలో చిత్తూరు యాసలో ట్రైనింగ్ తీసుకుంటున్నాడట. షూట్ కి వెళ్ళే నాటికి తన పాత్రకు సంబంధించిన సంభాషణలన్నింటినీ సమర్థవంతంగా అదే యాసలో పలకగలిగేలా ఏకంగా ముగ్గురు ట్యూటర్స్ ని పెట్టుకొని మరీ శిక్షణ తీసుకుంటున్నాడట బన్నీ. సినిమాలో ఎక్కువ శాతం అడవుల లోపలే జరుగనుందట.
ఇందు కోసం కేరళ, వికారాబాద్ అటవీ ప్రాంతాల్లో కీలక సన్నివేశాలను, ఆ తర్వాత బ్యాంకాక్ అడవుల్లో మరికొన్ని సీన్లను తెరకెక్కించనున్నారని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే ఈ నెల 8న అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా టైటిల్ను అధికారికంగా ప్రకటించే ఆలోచనలో యూనిట్ ఉండనే ప్రచారం జరుగుతోంది. స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి ‘శేషాచలం’ అనే టైటిల్ను అనుకుంటున్నారని ముందు నుండీ ప్రచారం జరుగుతోంది.
బన్నీ సరసన రష్మిక మందన్న నటించనున్న ఈ సినిమా శేషాచలం అడవుల్లో జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగనుందని ఇక ఇందులో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడని సమాచారం. అందుకే ఈ సినిమాలో బన్నీ చిత్తూరు యాసతో మాట్లాడతారని చెబుతున్నారు. మరి ఈ సినిమాకి ఏ టైటిల్ పెడతారో బన్నీ పుట్టిన రోజులు తేలనుందన్న మాట.