దేశం కాని దేశంలోని ఎడారిలో చిక్కుకున్న స్టార్ హీరో అండ్ టీమ్

ప్రపంచ దేశాల మీద కరోనా దెబ్బ మామూలుగా లేదు. ఎన్నో దేశాలు షట్ దౌన్ అయ్యాయి. దేశాలు ఇప్పట్లో అయితే కోలుకునే పరిస్థితి అయితే లేదు. ఇక దేశాలే ఇలా ఉంటె ఇక సినిమాల పరిస్థితి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏముంది. అందరూ ముందు కొంత లైట్ తీసుకుని షూటింగ్ లు చేసినా పరిస్థితి తీవ్రత అర్ధం అయ్యాక అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. ఏకంగా ఎక్కడో జార్జియాలో షూట్ చేసుకు వస్తామని వెళ్ళిన ప్రభాస్ యూనిట్ కూడా అన్ని ఆపేసి మధ్యలోనే భయపడి వచ్చేశారు. అయితే ఇప్పుడు ఒక హీరో ఇంత దారుణ స్థితిలో కూడా సినిమా షూటింగ్లో పాల్గొంటున్నాడని ఎవరు ఎలా పోతేనేమి తనకేం భయం అన్నట్టు షూట్ చేస్తున్నాడని ప్రచారం జరిగింది.
బ్లెస్సీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న "ఆడు జీవితం" సినిమాలో మలయాళ టాప్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా జోర్డాన్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది. అయితే అక్కడ అనుకున్నత లేదని వెనక్కి వచ్చి, తిరిగి మళ్లీ వెళ్లి షూట్ చేయాలనీ అలా చేస్తే ఖర్చు తడిసి మోపెడవుతుందన్న ఉద్దేశ్యంతో సినిమా యూనిట్ అక్కడే ఆగిందట. ముందే సినిమా కోసం యూనిట్ ఏప్రిల్ 10 దాకా షూట్ చేసుకునేందుకు అక్కడి అధికారుల దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుంది.
అయితే పరిస్థితి విషమిస్తున్నందున తమ నిర్ణయాన్ని మార్చుకున ఆడు జీవితం టీమ్ సభ్యులు మేము 58 మంది జోర్డాన్ ఎడారిలో చిక్కుకుపోయామని ఎలాగైనా మాకు సహాయపడాలని దర్శకుడు బ్లెస్సీ కేరళ ప్రభుత్వానికి, ఫిల్మ్ ఛాంబర్‌కు లేఖ రాశాడని చెబుతున్నారు. దేశం కాని దేశంలో తినడానికి తిండి కూడా దొరకడం లేదని కేరళ తిరిగి వద్దామన్నా విమానాల రాకపోకలు స్థంభించిపోయాయని ఈ సమయంలో ఎలా అయినా మీరే సాయం చేయాలని కోరుతున్నరాట.