English   

నా జీవితం చీకట్లో ఉన్నప్పుడు వెలుగు తనే అంటున్న మంచు మనోజ్..

Manchu manoj
2020-04-02 12:28:06

కరోనా వైరస్ కారణంగా సెలబ్రిటీలు ఎవరు కాలు బయట పెట్టడం లేదు. ఇంట్లోనే ఉండి అభిమానులతో మాట్లాడుకుంటున్నారు. వాళ్లతో మనసు విప్పి మాట్లాడటానికి ఇంతకంటే మంచి సమయం మరొకటి కాదు అని అనుకుంటున్నారు. అందుకే అందరూ ట్విట్టర్ లో లైవ్ చాట్ చేస్తున్నారు. అందులో మంచు మనోజ్ కూడా ఉన్నాడు. ఈయన కూడా అభిమానులు అడిగిన కొన్ని ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలు చెప్పాడు. అందులో ఒక అభిమాని మీ కోడలు విద్యా నిర్వణ గురించి చెప్పండి అంటే మంచు మనోజ్ మొహం వెలిగిపోయింది. అప్పటివరకు ఒకలా ఉన్న ఆయన కోడలు పేరు చెప్పగానే ఒక్కసారిగా ఆనందంలో తేలిపోయాడు. తన కోడలు బంగారం అంటూ మొదలు పెట్టాడు మనోజ్. 

ప్రతి మనిషి జీవితంలో కూడా కొద్దిరోజులు చీకటి ఉంటుందని.. అలాగే తన జీవితంలో కూడా చీకట్లు కమ్ముకున్నప్పుడు మళ్ళీ వెలుతురు వస్తుందా లేదా అనే అనుమానాలు వచ్చాయని చెప్పాడు మనోజ్. తన మనసులో మళ్ళీ ఎవరిమీదైనా ప్రేమ పడుతుందా లేదా.. అసలు తనలో ప్రేమంటూ ఉందా.. ఇంకా ఎవరినైనా ప్రేమిస్తానా లేదా అనే అనుమానాలు వస్తున్న వేళ తన జీవితంలోకి వెలుతురులా వచ్చింది తన కోడలు విద్యా నిర్వాణ అంటున్నాడు మనోజ్. తను మాట్లాడే పద్ధతి కానీ.. ఆడుకోవడం కానీ అన్ని తన జీవితాన్ని మార్చేశాయని చెబుతున్నాడు. పూర్తిగా చీకట్లోకి వెళ్లిపోయిన తన జీవితాన్ని మళ్లీ వెలుగులోకి తీసుకొచ్చింది తన కోడలు అంటున్నారు మంచు మనోజ్. తన అక్క మంచు లక్ష్మి.. విద్యను చాలా బాగా పెంచుతుందని మెచ్చుకున్నాడు. మొత్తానికి విడాకుల తర్వాత మనోజ్ చాలా డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడని ఈ మాటలు చూస్తుంటే అర్ధం అవుతుంది. 
 

More Related Stories