English   

మరోసారి వార్తల్లోకి పవన్ క్రిష్ ల సినిమా..ఎందుకంటే

 Pawan kalyan
2020-04-02 17:36:18

పవన్ ప్రస్తుతం హిందీలో భారీ విజయం సాధించిన పింక్ రీమేక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎంసీఏ దర్శకుడు వేణు శ్రీరామ్ ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా బోనికపూర్,దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. స్త్రీ రక్షణ, మహిళా హక్కుల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు వకీల్ సాబ్ అనే టైటిల్ ను ఖరారు చేసారు. కాగా సినిమాలో పవన్ అమితాబ్ స్థానంలో లాయర్ గా నటిస్తున్నారు.ఈ సినిమాకు థమన్ స్వరాలను అందిస్తున్నారు.  సినిమా షూటింగ్ ను కూడా ఇప్పటికే మొదలు పెట్టగా లాక్ డౌన్ కారణంగా  గ్యాప్ ఇచ్చారు.  కాగా సినిమాలో తాప్సి స్థానంలో నివేదిత థామస్ ను ఎంపిక చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి.

ఇదిలా ఉండగా పవన్ పింక్  సినిమాను త్వరగా పూర్తి చేసుకుని తరవాత సినిమా క్రిష్ తో చేయాలనుకున్న సంగతి విదితమే. పవన్ 27వ సినిమా కోసం క్రిష్ ఒక షెడ్యూల్ ను కూడా పూర్తి చేసుకున్నారు. పూర్తి స్క్రిప్ట్ ను రెడీ చేసి క్రిష్ పవన్ కు వినిపించాలనుకునే సమయంలో లాక్ డౌన్ ఎఫెక్ట్ పడింది. అయితే లాక్ డౌన్ ఎత్తివేయగానే పవన్ సినిమాలో నటించే పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకంటే  ఈ సమయంలో ఆయన షూటింగ్ లో పాల్గొంటే రాజకీయయంగా విమర్శలు ఎదుర్కోవలసి వస్తుంది. దాంతో ఒక నెల రోజులైనా గ్యాప్ తీసుకోవలసి వస్తుంది. కాబట్టి ముందు ప్రేక్షకులకోసం ముందు పింక్ ను విడుదల చేసే అవకాశం ఉంది. 
 

More Related Stories