English   

హైదరాబాద్ ఎంతో ప్రశాంతంగా ఉందంటున్న చిరంజీవి..

chiru
2020-04-02 19:08:56

లాక్ డౌన్ పుణ్యమా అని అంతా ఇళ్లకే పరిమితం అయిపోయారు. జనమంతా బయటికి రావడానికి కూడా భయపడుతున్నారు. ఇంట్లోనే ఉండి హాయిగా కుటుంబాలను చూసుకుంటున్నారు. దాంతో ఇప్పుడు చిరంజీవి కూడా ఇదే చెప్తున్నాడు. ఈయన కూడా తన ఇంటి నుంచి పొద్దున్నే లేచి హైదరబాద్ అందాలను చూపిస్తున్నాడు. ముఖ్యంగా సిటీ ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి అంటూ వీడియో పోస్ట్ చేసాడు మెగాస్టార్. అందులో అప్పుడే బయటికి వస్తున్న సూర్యున్ని కూడా చూపించాడు చిరు. రోజూ ఉరుకుల పరుగుల జీవితంలో ఎంతో మిస్ అవుతున్నాం కానీ నిజంగా ఈ నగరం చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉందని చెబుతున్నాడు చిరు. ఆ వీడియోలో మెగాస్టార్ ఇల్లు కూడా కనిపిస్తుంది. లాక్ డౌన్ ప్రకటించిన రోజు నుంచి పొద్దున్నే లేని తన పని తానే చేసుకుంటున్నాడు చిరు. ముఖ్యంగా ఇంటి ముందు మొక్కలకు నీళ్లు కూడా పడుతున్నాడు. ఆ తర్వాత మనవళ్లు, మనవరాళ్లతో ఆడుకుంటూ సమయం గడిపేస్తున్నాడు మెగాస్టార్.

More Related Stories