English   

షారుక్ ఖాన్, అట్లీ కుమార్.. సెన్సేషనల్ కాంబినేషన్ సెట్..

khan
2020-04-02 19:42:16

ఒక్పపుడు కింగ్ ఖాన్.. బాలీవుడ్ బాద్షా అంటూ చాలా పేర్లతో పిలిచేవాళ్లు. కానీ ఇప్పుడు అలాంటివేం లేవు.. ఆ మాటకొస్తే ఆయనే రెండేళ్లుగా కనిపించడం లేదు. టైమ్ బాలేన‌పుడు అరిటిపండు తిన్నా ప‌న్నిరిగిద్ది అంటారు క‌దా.. ఇప్పుడు షారుక్ ఖాన్ కు అదే జ‌రుగుతుంది. అస‌లు ఎలా ఉండే హీరో.. ఇప్పుడు ఎలా అయిపోయాడు అనిపిస్తుంది ఇప్పుడు షారుక్ ను చూస్తుంటే. ఈయ‌న సినిమాలు వ‌చ్చిన‌ట్లు కూడా ఎవ‌రికీ తెలియ‌డం లేదు. వ‌చ్చిన సినిమా వ‌చ్చిన‌ట్లు వెళ్లిపోతున్నాయి. మొన్న‌టికి మొన్న విడుద‌లైన జ‌బ్ హ్యారీ మెట్ సెజ‌ల్ కూడా డిజాస్ట‌రే. ఏ సినిమాకు కూడా క‌నీసం 100 కోట్లు రావ‌డం లేదు. ఒక‌ప్పుడు కింగ్ లా బాక్సాఫీస్ ను ఏలేసిన ఈ హీరో.. ఇప్పుడు ఉనికి కోసం ప్ర‌య‌త్నిస్తున్నాడు. ఐదేళ్లు దాటిపోయింది షారుక్ సినిమా బాక్సాఫీస్ ను క‌సితీరా కుమ్మేసి. చెన్నైఎక్స్ ప్రెస్ త‌ర్వాత ఆ స్థాయి సినిమా మ‌ళ్లీ షారుక్ కు ప‌డ‌లేదు. ఫ్యాన్.. దిల్ వాలే.. రాయీస్.. హ్యాపీ న్యూ ఇయ‌ర్.. ఇలా ప్ర‌తీ సినిమా వ‌స్తుంది వెళ్తుంది కానీ ఏదీ బాద్షా రేంజ్ మార్చ‌లేదు.

జ‌బ్ హ్యారీ మెట్ సెజ‌ల్ తో అయినా బ్లాక్ బ‌స్ట‌ర్ కొడ‌తాడేమో అనే ఆశ‌లో ఉన్న ఫ్యాన్స్ కు ఈ సారి కూడా సారీ చెప్పేసాడు షారుక్ ఖాన్. ఆ త‌ర్వాత జీరో కూడా దారుణంగా ఫ్లాప్ అయింది. ఈ సినిమా కూడా డిజాస్ట‌ర్ అయిన త‌ర్వాత షారుక్ పూర్తిగా సినిమాల‌కు దూరం అయిపోయాడు. రెండేళ్ల నుంచి సరైన స్క్రిప్ట్ కోసం చూస్తున్నాడు ఈయన. ఇన్నాళ్లకు అభిమానుల ఆశలు తీరినట్లు కనిపిస్తున్నాయి. తాజాగా అట్లీ కుమార్ చెప్పిన కథ నచ్చి ఈయనతో సినిమా చేయడానికి షారుక్ సిద్ధమయ్యాడని తెలుస్తుంది. ఈ ఇద్దరి కాంబినేషన్ గురించి చాలా రోజులుగా ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు అది సెట్ అయినట్లు కనిపిస్తుంది. త్వరలోనే ఈ కాంబోలో సినిమా మొదలు కానుంది.

More Related Stories