English   

తెలుగు రైటర్ అబ్బూరి రవికి మాతృ వియోగం..

ravi
2020-04-02 20:24:38

ప్రముఖ రచయిత అబ్బూరి రవి మాతృమూర్తి లలిత ఎప్రిల్ 1 సాయంత్రం మరణించారు.‌ ఆమె వయసు 73 సంవత్సరాలు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఈమెకు.. ఉన్నట్లుండి గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. ఎప్రిల్ 2 ఉదయం హైదరాబాద్ ఫిల్మ్‌నగర్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించారు.‌ లలిత గారికి నలుగురు కుమారులు. నలుగురిలో అబ్బూరి రవి ఆఖరి సంతానం. కరోనా కారణంగా చాలా తక్కువ మంది ఈ అంత్యక్రియలకు హాజరయ్యారు. కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే వచ్చారు. ఇండస్ట్రీలోని ప్రముఖులు అబ్బూరి రవికి సంతాపం వ్యక్తం చేసారు. ఈయన బొమ్మరిల్లు లాంటి సినిమాలకు రచయితగా పని చేసారు.

 

More Related Stories