English   

నాని ప్లేస్ లో విజయ్ దేవరకొండ 

 Vijay devarakonda
2020-04-03 09:09:53

మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా సినిమాలతో తనకంటూ మంచి పేరు సంపాదించుకున్నాడుయువ దర్శకుడు  వివేక్ ఆత్రేయ. బ్రోచేవారెవరురా సినిమా తర్వాత ఆయన బెల్లంకొండ తమ్ముడు గణేష్ హీరోగా పరిచయం అవుతున్న సినిమాకి మాటల రచయితగా పని చేస్తున్నాడు. సావిత్రి ఫేమ్ పవన్ సాధినేని ఆ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే వివేక్ మొన్నీమధ్య నానికి ఒక లైన్ చెప్పినట్టు ఆ లైన్ నచ్చిన నాని సినిమా చేయడానికి రెడీ అయినట్టు ప్రచారం జరిగింది. మరి ఆ ప్రచారం అయితే మరుగున పడిపోయింది. ఇప్పుడు మరో ప్రచారం మొదలయింది. 

అదేంటంటే వివేక్ విజయ్ దేవరకొండకి కధ చెప్పి ఒప్పించాడట. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం నాని స్థానంలో విజయ్‌ నటించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. వివేక్‌ ఇప్పటికే విజయ్‌కి కథ వినిపించాడని, విజయ్‌కి కధ కూడా నచ్చిందని టాక్‌. త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి. అయితే నాని కోసం రాసుకున్న కథని దేవరకొండతో తీస్తాడా, లేక మరో కొత్త కథతో వస్తున్నాడా? అనే దాని మీద క్లారిటీ లేదు. ఇక ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ‘ఫైటర్‌’ చేస్తున్నాడు. కరోనా ఎఫెక్ట్ తో సినిమా షూటింగ్ ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఇక సినిమా ప్రముఖులు అందరూ కరోనా మీద యుద్హానికి తమ వంతుగా ఎంతో కొంత ఫండ్ ఇస్తుంటే దేవరకొండ ఇవ్వలేదని ఒక రేంజ్ లో ఆడుకుంటున్నారు నెటిజన్లు.

More Related Stories