English   

బాలయ్య ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్...ఈ సారి రచ్చరచ్చే 

Puri Jagannadh
2020-04-03 09:25:24

ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్‌ గా ప్రేక్షకుల మన్ననలు అందుకున్న పూరీ జగన్నాథ్ టెంపర్ తర్వాత హిట్ లు లేక డీలాపడ్డారు. ఆ సినిమా తరవాత పూరీ దర్శకత్వంలో ఆరు సినిమాలు వచ్చినా ఒక్కటీ హిట్టు కాలేదు. ఈసారి ఎలాగైనా హిట్టుకొట్టి పూర్వవైభవాన్ని సంపాదించాలని గట్టిగా ఫిక్స్ అయిన పూరి హీరో రామ్‌ తో ఇస్మార్ట్ శంకర్ అనే సబ్జెక్ట్ ఎంచుకుని మరీ హిట్టు కొట్టాడు. ఇక ఈ సినిమా తర్వాత పూరీ జగన్నాథ్ ఫాంలో ఉన్న విజయ్‌ దేవరకొండతో మార్షల్ ఆర్ట్స్ నేపధ్యంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఇంకా టైటిల్ ఫైనల్ కాని ఈ సినిమా మీద గట్టిగానే అంచనాలున్నాయి. ఈ సినిమా తర్వాత విజయ్ చేసే సినిమాలు ఇవే నని ప్రచారం జరుగుతున్నా పూరీ చేసే సినిమా మీద ఎటువంటి విషయం బయటకు రాలేదు. అయితే అందుతున్న సమాచారం మేరకు పూరీ జగన్నాథ్.. బాలకృష్ణకి అదిరిపోయే స్క్రిప్ట్‌ రెడీ చేస్తున్నట్టు చెబుతున్నారు.

 ప్రస్తుతం లాక్‌డౌన్ సందర్భంగా ఇళ్ళు దాటి బయటకు రాలేని పరిస్థితుల్లో ఓ కథను బాలయ్యకు ఫోన్‌లో వినిపించి మెస్మరైజ్ చేశాడట పూరీ. కధ విన్న బాలయ్య ఓకే చెప్పినట్టు సమాచారం. గతంలో వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘పైసా వసూల్’ సినిమా పెద్దగా ఆడకున్నా బాలయ్యను మునుపెన్నడూ లేని విధంగా చూపించి పూరీ జగన్నాథ్ మంచి మార్కులే కొట్టేశాడు. అప్పట్లోనే బాలకృష్ణ పూరీ టేకింగ్‌కు ఫిదా అయి రెండో సినిమా చేస్తానని మాట ఇచ్చాడు. ఈ క్రమంలోనే వీరిద్దరూ కలిసి పని చేయనున్నట్టు చెబుతున్నారు. ఇప్పటికే బాలయ్య వరుస సినిమాలు లైన్ లో పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. ప్రస్తతం బోయపాటితో సినిమా చేస్తున్న ఆయన బీ గోపాల్, సింగీతం లాంటి వారితో సినిమా చేస్తాడని ప్రచారం జరుగుతోంది.  మరి వీరిద్దరి కాంబినేషన్ సినిమాని ఎప్పటికి తెర మీద చూస్తామో ఏమో ?

More Related Stories