English   

ప్రభాస్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్...అది ఇప్పట్లో లేదట 

Prabhas
2020-04-03 10:37:16

బాహుబలి లాంటి అంతర్జాతీయ స్థాయి సినిమా తరువాత గత ఏడాది ప్రభాస్ నుండి వచ్చిన సాహోకి అన్ని వర్గాల నుండి మిశ్రమ స్పందన వచ్చింది. హిందీలో సాహో సూపర్ హిట్ కాగా తెలుగుతో పాటు సౌత్ బాషలలో ఈ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ క్రమంలో ప్రభాస్ ఫ్యాన్స్ ఆయన తదుపరి చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ లవ్ డ్రామా 'జాన్' మీద పై చాల ఆశలే పెట్టుకున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ఐతే కర్ణుడు చావుకు వంద కారణాలు అన్నట్టు నడుస్తున్న ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ ఎప్పుడవుతుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి. 

ఇప్పుడు కరోనా వైరస్‌ కారణంగా షూటింగ్‌ అంతా ఆపేసి ఎవరిళ్లలో వారు కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే సాహో సినిమా ఆగష్టులో రిలీజ్ అయింది కాబట్టి జాన్ ని కూడా వీలయినంత త్వరగా పూర్తి చేసి ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేద్దామని అనుకున్నారు. కానీ అది కుదరలేదు సరికదా వచ్చే ఏడాది సంక్రాంతికి కూడా ఇది వచ్చే సూచనలు కనపడడం లేదని అంటున్నారు. 2021 సంక్రాంతి కానుకగా ఈ మూవీని విడుదల చేయాలని భావించినా, అది కుదిరేలా లేదు. అయితే ఇప్పటికే ప్రభాస్‌ వైజయంతి మూవీస్‌ పతాకంపై నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా అనౌన్స్ చేశాడు. ‘జాన్‌’ పూర్తి కాకుండా నాగ్‌ అశ్విన్‌ చిత్రం షూటింగ్‌ ప్రారంభమయ్యే అవకాశం లేదని సినీ వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం. చూడాలి మరి ఈ సినిమా ఎప్పటికి పూర్తవుతుందో ?

More Related Stories