మరో రికార్డు బద్దలు కొట్టిన రాములో రాములా...ఇప్పుడిదే నంబర్ వన్

అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో మొన్న సంక్రాంతికి రిలీజయిన సినిమా అల వైకుంఠపురములో. భారీ అంచనాల మధ్య, మరో భారీ బడ్జెట్ సినిమా సరిలేరు నీకేవ్వారు సినిమాతో పోటీకి దిగిన ఈ సినిమా సంక్రాంతికి ఆ సినిమాకి గట్టి పోటీ ఇచ్చింది. ఒక రకంగా ఆ సినిమా మహేష్ సినిమా కంటే బాగా ఆడిందని కూడా చెప్పక తప్పదు. ఇక ఈ సినిమాలోని పాటలు కూడా ఛార్ట్ బస్టర్స్ అయ్యాయి. ఇప్పటికే సామజవరగమనా, సిత్తరాల సిరపడు వంటి పాటలు యూ ట్యూబ్‌లో సరికొత్త రికార్డులకు తెరతీయగా ఇప్పుడు రాములో రాములా సాంగ్ అయితే అన్నిటినీ తోసిరాజని ముందుకు వెళుతోంది. మొన్నీమధ్య ఏకంగా 200 మిలియన్ల వ్యూస్‌తో డబుల్ సెంచరీ కొట్టేసి రచ్చ చేసిన ఈ సాంగ్ ఇప్పుడు మరో రికార్డు బద్దలు కొట్టింది.
గత ఏడాది దీపావళి రోజున అంటే అక్టోబర్ 26న ఈ పాటని యూట్యూబ్‌లో అప్లోడ్ చేయగా తాజాగా 247 మిలియన్ల (24 కోట్ల) వ్యూస్‌ని క్రాస్ చేసింది. థమన్ సంగీతం, కాసర్ల శ్యామ్ సాహిత్యం, అనురాగ్ కులకర్ణి, మంగ్లి గాత్రం, వెరసి రాములో రాములాకి సాంగ్ ని ఇక్కడ కూర్చో బెట్టాయి. యూట్యూబ్ లో తెలుగు సినిమా పాటలకు సంబంధించి నిన్నటి వరకు ‘ఫిదా’లోని “వచ్చిండే” సాంగ్ నంబర్ వన్ స్థానంలో ఉండేది. ఆ పాటకి 246 మిలియన్ వ్యూస్ ఉన్నాయి ప్పుడు ఆ స్థానాన్ని “రాములో రాములా” 247 మిలియన్ వ్యూస్ తో దాటించడం విశేషం.