English   

రాంచరణ్ కు ఇష్టమైన హీరోయిన్ ఎవరంటే..

Ram Charan
2020-04-03 15:36:07

మెగాస్టార్ తనయుడు రాంచరణ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. చిరుత తోనే చరణ్ టాలీవుడ్ లో తన మార్క్ వేసుకోగా  రంగస్థలంతో చరణ్ నటనతో మరో మెట్టు ఎక్కాడు.  ఈ విషయాన్ని దర్శక ధీరుడు రాజమౌళి స్వయంగా తెలిపారు. ప్రస్తుతం చెర్రీ భారీ బడ్జెట్ ముల్టీ స్టారర్ లో నటిస్తుండగా ఆ సినిమాకు సంబందించి చరణ్ వీడియో ఒకటి పుటిన రోజు సందర్భంగా ఎన్టీఆర్ విడుదల చేయగా దాంట్లో అల్లూరి లుక్ లో చరణ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. సిక్స్ పాక్ బాడీతో చరణ్ వీడియో తెలుగులోనే కాకుండా హిందీ తమిళ భాషల్లో ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. వీడియో చూసిన అభిమానులు సినిమా కోసం ఆగలేమంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇదిలా ఉండగా చరణ్ ఈ మధ్య వచ్చిన ఒక ఇంటర్వ్యూ లో షాకింగ్ కామెంట్ లు చేసాడు. యాంకర్ మీకు నచ్చిన హీరోయిన్ ఎవరని చరణ్ ని అడగగా చరణ్ ఏమి ఆలోచించకుండా రౌడీ బేబీ సాయి పల్లవి పేరు చెప్పేసాడు. సాయిపల్లవి డాన్స్ అన్నా  నటన అన్నా తనకు ఇష్టమని  చరణ్ చెప్పడం ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.కాగా అప్పటి హీరోయిన్ లలో చరణ్ కు ఇష్టమైన హీరోయిన్ శ్రీదేవి కాగా ఇప్పుడు ఉన్న భామల్లో సాయి పల్లవి అని చెప్పడం విశేషం.  
 

More Related Stories