English   

సెక్స్ కావాలని అగ్ర హీరోలే అడుగుతున్నారా...

Ileana DCruz
2020-04-03 16:17:55

తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ చాలా మంది హీరోయిన్లు దాని బాధితులే. శ్రీ రెడ్డి లాంటి వాళ్లైతే బయటికి వచ్చి మరీ తమకు జరిగిన దాని గురించి చెప్పుకుంటున్నారు. కొందరు మాత్రం చెప్పుకోవడం లేదు అంతే తేడా. ఇప్పుడు కూడా ఇలాంటి ఘటనే మరోసారి జరిగింది. టాలీవుడ్ లో కొందరు అగ్ర హీరోలు సెక్స్ కావాలని నేరుగానే అడుగుతున్నట్లు సంచలన వ్యాఖ్యలు చేసింది ఇలియానా. ఇండస్ట్రీలో ఉన్న కొందరు అగ్ర నిర్మాతలు, హీరోలు జూనియర్ ఆర్టిస్టుల నుంచి హీరోయిన్ల వరకు అవసరం తీర్చకపోతే అవకాశాలు రావని చెబుతున్నట్లు కామెంట్స్ చేసింది. ఇది తాను చూసిన సంఘటన అని సంచలనం రేపింది ఇలియానా. 

నన్నిలా అడుగుతున్నారు.. అవకాశం రావాలంటే కచ్చితంగా నేను ఆ పని చేయాలంట.. దర్శకుడు, హీరోతో పడుకోవాలంట.. మరి ఏం చేయాలని తనను ఓ హీరోయిన్ వచ్చి అడిగిందని చెబుతుంది ఇలియానా. ఓ పక్క మానం కాపాడుకోవాలనే ఆవేదన.. మరోవైపు అవకాశం కోసం ఆరాటం రెండూ ఆ అమ్మాయిలో కనిపించాయని.. అలాంటప్పుడు తానేం చెప్పగలనని చెప్పింది గోవా బ్యూటీ. ఇది పూర్తిగా నీ నిర్ణయం అని ఆమెతో చెప్పినట్లు ఓపెన్ అయిపోయింది ఇలియానా. 

ఇలాంటి విషయంలో ఏ అమ్మాయిని కూడా బలవంతం చెయ్యకూడదు.. అది పూర్తిగా నీ యిష్టం మీదే ఆధారపడి ఉంటుంది.. ఇండస్ట్రీలో కొందరు ఇలాంటి విషయాలను లైట్ తీసుకుంటున్నారు.. మరికొందరు మాత్రం ఇలాంటి దారి వద్దనుకుంటున్నారు.. మరి నీ నిర్ణయం ఎలాంటిదో నువ్వే నిర్ణయించుకో అని చెప్పినట్లు గుర్తు చేసుకుంది ఈమె. మొత్తానికి బయటికి తెలిస్తే పరువు పోతుందని చాలా మంది చెప్పట్లేదు కానీ ఇండస్ట్రీలో మాత్రం అవకాశాల కోసం అగ్ర హీరోలు కూడా సెక్స్ కావాలని నేరుగానే అడుగుతున్నట్లు సంచలన వ్యాఖ్యలు చేసింది ఇలియానా. 

More Related Stories