English   

పవన్ కళ్యాణ్, క్రిష్ సినిమాకు అదే టైటిల్ ఫిక్స్ చేసారా..

Pawan kalyan
2020-04-03 17:18:26

రాజకీయాలను ప్రస్తుతం పక్కనపెట్టి సినిమాలతో మళ్లీ బిజీ అయిపోయాడు పవన్ కళ్యాణ్. కెరీర్ లో ఎప్పుడూ లేని విధంగా ఒకేసారి మూడు సినిమాలు ఒప్పుకున్నాడు.. మరో రెండు సినిమాలు లైన్ లోనే ఉన్నాయి. అందులో పింక్ సినిమా రీమేక్ వకీల్ సాబ్ ముందు విడుదల కానుంది. ఈ సినిమాను మే 15న అనుకున్నారు కానీ ఇప్పుడు ఆలస్యమయ్యేలా కనిపిస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాతో పాటు క్రిష్ సినిమా కూడా చేస్తున్నాడు పవన్. ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికర వార్తలు ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. 

ఇందులో పవన్ పాత్ర పేరు వీర అని అంటున్నారు. అంతేకాదు పవన్ పేరు కలిసొచ్చేలా ఈ సినిమాకు 'విరూపాక్షి' అనే టైటిల్ పెడుతున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఈ టైటిల్ పై కొన్ని రోజుల నుంచి కన్ఫ్యూజన్ ఉంది కానీ ఇప్పుడు ఇదే కన్ఫర్మ్ చేసినట్లు వార్తలొస్తున్నాయి. ఇందులో ఇద్దరు హీరోయిన్లు ఉండబోతున్నారు. ఇందులో ఒకరు జాక్వలిన్ ఫెర్నాండేజ్ పేరు కూడా వినిపిస్తుంది. సాహో సినిమాలో ఐటం సాంగ్ చేసింది ఈమె. ఇక మరో హీరోయిన్ గా కీర్తి సురేష్ తో మరోసారి రొమాన్స్ చేయబోతున్నాడు పవన్. 

ఇప్పటికే అజ్ఞాతవాసిలో ఒకసారి జోడి కట్టాడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు మరోసారి ఈ జోడి రిపీట్ చేయాలని చూస్తున్నాడు క్రిష్. అన్నట్లు సినిమాలో అనసూయ భరద్వాజ్ కూడా ఓ కీలక పాత్ర పోషించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 18వ శతాబ్దపు పాలమూరు పండుగ సాయన్న అనే ఒక రాబిన్ హుడ్ తరహా పాత్రలో పవన్ కళ్యాణ్ నటిస్తున్నట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ పాత్ర కోసం పవన్ కళ్యాణ్ బాగానే కష్టపడుతున్నాడు. పవన్‌తో 'ఖుషి' లాంటి సంచలన సినిమాను నిర్మించిన ఎ.ఎం.రత్నం ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం కరోనా కారణంగా సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా 25 కోట్లు ఖర్చు చేసి తాజ్ మహల్, చార్మినార్ సెట్స్ నిర్మించారు. వచ్చే ఏడాది విరూపాక్షి విడుదల కానుంది. 

More Related Stories