English   

థ్యాంక్యూ డియర్ బ్రదర్.. బాలయ్యకు చిరు ధన్యవాదాలు..

 Chiranjeevi
2020-04-03 17:28:20

బాలకృష్ణ, చిరంజీవి ఎంత మంది స్నేహితులు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనకు ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్ చిరు ఒక్కడే అని చెప్తాడు బాలయ్య. ఇక ఇప్పుడు ఈయన్ని మెగాస్టార్ చిరంజీవి అభినందించాడు. కరోనా మహమ్మారిని అంతం చేయడానికి అంతా కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈయన కరోనా క్రైసిస్ ఛారిటీకి 25 లక్షలు విరాళంగా ఇచ్చాడు. దీనికి చిరంజీవి అధ్యక్షుడిగా ఉన్నాడు. ఎవరు విరాళం ఇచ్చినా కూడా వెంటనే ట్విట్టర్ లో వాళ్లను అభినందిస్తున్నాడు చిరు. ఈ క్రమంలోనే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కరోనా క్రైసిస్ ఛారిటీకి కూడా కలిపి కోటి 25 లక్షలు విరాళంగా ఇచ్చిన బాలయ్యను ప్రత్యేకంగా అభినందించాడు చిరు. డియర్ బ్రదర్ అంటూ మొదలుపెట్టిన చిరంజీవి.. 1 కోటి 25 లక్షల రూపాయల విరాళం అందించడం సంతోషంగా ఉందన్నాడు చిరు. ప్రజలకు కష్టమొచ్చిన ప్రతి సమయంలో సినీ నటులు అంతా ఒక్కటిగా ముందుకు వస్తుంది. మీ అండదండలు సినీ పరిశ్రమకు ఉండాలని చిరంజీవి తన ట్వీట్‌లో తెలిపారు. బాలయ్య కాస్త ఆలస్యంగా విరాళం ఇచ్చాడని చాలా మంది అంటున్నారు కానీ ఈయన లేట్ గా అయినా కూడా లేటెస్ట్ గా భారీ విరాళమే ఇచ్చాడంటూ ప్రశంసలు దక్కుతున్నాయి. మరి దీనికి బాలయ్య నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలిక. 

More Related Stories