చిరంజీవి,నాగార్జునకు తెలుగులో ప్రశంసలందించిన మోదీ...

కరోనా వైరస్ అరికట్టడానికి ప్రపంచమంతా ఇప్పుడు కృషి చేస్తుంది. ఇందులో భాగంగానే ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా అందరు ముందుకొచ్చి తమవంతు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి అధ్యక్షతన తెలుగు సినిమా నటులు మొత్తం ఒక్కొక్కరుగా ముందుకొచ్చి కరోనాను అంతం చేయడానికి కృషి చేయాలని పిలుపునిస్తున్నారు. సంగీత దర్శకుడు కోటి స్వరకల్పనలో చిరంజీవి, నాగార్జున, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ ఓ పాటలో కూడా కనిపించారు. వి కిల్ కరోనా.. వి ఫైట్ విత్ కరోనా అంటూ వాళ్లు చేసిన ఈ పాట ఇప్పుడు ప్రధాని మోదీ వరకు వెళ్లింది. దీన్ని గుర్తించిన ఆయన తెలుగులో ట్వీట్ చేసాడు.
చిరంజీవిగారికీ, నాగార్జునగారికీ, వరుణ్ తేజ్ కీ, సాయి ధరమ్ తేజ్ కీ మీరందరూ ఇచ్చిన అతి చక్కని సందేశానికి నా ధన్యవాదాలు.
అందరం మన ఇళ్ళల్లోనే ఉందాం.
అందరం సామాజిక దూరం పాటిద్దాం.
కరోనా వైరస్ పై విజయం సాధిద్దాం.. అని ట్వీట్ చేసారు మోదీ.