English   

కరోనాతో పండగ చేసుకుంటున్న టీవీ ఛానెల్స్.. 

Coronavirus
2020-04-04 06:36:57

కరోనా కర్ఫ్యూ ఏమో కానీ ఇది మాత్రం ఇప్పుడు కొన్ని ఛానెల్స్ కు పండగ వాతావరణం తీసుకొచ్చింది. సాధారణంగా సెలవులు వస్తే సినిమాలకు వెళ్తారు.. లేదంటే బయటికి వెళ్తారు. కానీ ఇప్పుడు రెండూ బంద్ అయిపోయాయి. చచ్చినట్లు ఇంట్లో కూర్చోవాల్సిందే. అందుకే ఛానెల్స్ అన్నీ పండగ చేసుకుంటున్నాయి. ముఖ్యంగా లీడింగ్ ఛానెల్స్ లో మంచి సినిమాలు వస్తే కచ్చితంగా రేటింగ్స్ కూడా అదిరిపోతున్నాయి. గతంతో పోలిస్తే అంతకంటే సూపర్ రేటింగ్స్ వచ్చాయి ఈ వారం. గత వారం మొత్తం జనాలంతా ఇంట్లోనే ఉండిపోవడంతో ఆ ప్రభావం టీవీ రేటింగ్స్ పై కూడా పడుతుంది. సీరియల్స్ కొన్ని ఆగిపోయినా కూడా సినిమాలకు మాత్రం అదిరిపోయే టిఆర్ఫీ వచ్చింది. 

ముఖ్యంగా సరిలేరు నీకెవ్వరు అయితే జెమినిలో తొలిసారి ప్రసారం చేస్తే ఏకంగా 23.4 టీఆర్పీ దక్కించుకుంది. బాహుబలి రికార్డులను కూడా తిరగరాసింది ఇది. మరోవైపు సాయి ధరమ్ తేజ్ హీరోగా దర్శకుడు మారుతి తెరకెక్కించిన ప్రతిరోజూ పండగే చిత్రం మా టీవీలో 15.3 టీఆర్పీ దక్కించుకుంది. ఈ రెండు సినిమాలు కూడా థియేటర్స్ లో కలెక్షన్ల వర్షం కురిపించాయి. ఇప్పుడు టీవీల్లో కూడా రప్ఫాడించాయి. నిజానికి రెండింటిని చాలా మంది చూసే ఉంటారు. కానీ బయటికి వెళ్లే ఆప్షన్ లేక ఇంట్లో ఛానెల్ మార్చకుండా చూడటంతోనే రేటింగ్స్ వచ్చాయి. మరోవైపు జబర్దస్త్, అదిరింది లాంటి కామెడీ షోలకు కూడా రేటింగ్స్ అదిరిపోయాయి.

More Related Stories