English   

నా కంటే గొప్ప నటుడు ఎవరంటున్న రాజమౌళి..

rajamouli
2020-04-04 06:45:24

అదేంటి దర్శకుడిని పట్టుకుని నటుడు అంటున్నారు.. అంతేలే ప్రతీ దర్శకుడిలోనూ నటుడు ఉండాలి కదా అనుకుంటున్నారా..? అవును నిజమే.. కానీ నిజంగానే ఈయన ఇప్పుడు గొప్ప నటుడు. ఈ విషయం ఎవరో చెప్పడం కాదు.. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కంటే కూడా నేనే గొప్ప నటున్ని అని రాజమౌళే చెప్పాడు. అది విని అభిమానులు కూడా షాక్ అయ్యారు. అయితే దీని వెనక ఓ కథ కూడా ఉంది. నిజానికి ఈ రోజుల్లో 50 కోట్లు పెట్టి సినిమా తీసిన నిర్మాతలకే నిద్ర పట్టదు.. దర్శకుడు అయితే సినిమా విడుదలయ్యేంత వరకు కంటి మీద కునుకు కూడా ఉండదు. అలాంటిది సినిమా సినిమాకు దాదాపు 400 కోట్లు పెట్టిస్తున్నాడు రాజమౌళి. ఇప్పుడు ఆయన చేస్తున్న RRR కూడా అంతే బడ్జెట్ తో వస్తుంది. మరి అంత బడ్జెట్ పెట్టినపుడు మీకు భయం అనిపించదా అని రాజమౌళికి ఓ ప్రశ్న వచ్చింది. దీనికి ఆయన ఆసక్తికరమైన సమాధానం చెప్పాడు. నాకు భయం లేదని ఎవరు చెప్పారు అని విక్రమార్కుడులో రవితేజ రేంజ్ లో అందుకున్నాడు రాజమౌళి. ప్రతిక్షణం భయపడుతూనే ఉంటానని.. నిర్మాతలాగే తనకు కూడా టెన్షన్ ఉంటుందని.. తను తీసిన సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందో లేదో అని ఆలోచిస్తూ ఉంటానని చెప్పాడు. అయితే దాన్ని కవర్ చేసుకోడానికి మేకపోతు గాంభీర్యం నటిస్తూ ఉంటానని.. ఎందుకంటే అక్కడున్న అందరికంటే తానే గొప్ప నటున్ని అని చెప్పాడు రాజమౌళి. ఈయన చెప్పేది నూటికి నూరుపాళ్లు నిజం. ఎందుకంటే ఎంత భయమున్నా కూడా మాటల్లో, చేతల్లో, కంటి చూపుల్లో మాత్రం కనిపించనీయడు రాజమౌళి. అదే దర్శక ధీరుడి గొప్పతనం.. ఈయన తెరకెక్కిస్తున్న RRR జనవరి 8న విడుదల కానుంది.

More Related Stories