English   

కీర్తి సురేష్ పెళ్లి...ఎవరితో అంటే 

Keerthy Suresh
2020-04-04 12:04:09

సినిమా వాళ్ళ వ్యక్తిగత జీవితాల మీద జనాలు పెట్టె శ్రద్ధ అంతా ఇంతా కాదు. వాళ్ళ పర్సనల్స్ అంటే ఎందుకో ఇప్పటికీ జనాల్లో క్రేజ్. గీతాంజలి సినిమాతో సొంత బాష మలయాళానికి, ఇదు ఎన్న మాయంతో తమిళానికి, నేను శైలజతో టాలీవుడ్ కు పరిచయం అయిన కీర్తి సావిత్రి బయోపిక్ మహానటిలో నటించి బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డ్ అందుకున్నారు. తెరంగ్రేటం చేసిన చాలా తక్కువ కాలంలోనే అగ్రతార స్టేటస్ సాధించిన ఆమె ప్రస్తుతం ఉమెన్ సెంట్రిక్ మూవీస్ “మిస్ ఇండియా “, “పెంగ్విన్ “, గుడ్ లక్ సఖి ” లాంటి సినిమాల్లో నటిస్తున్నారు. 

అయితే కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు దేశ వ్యాప్తంగా ప్రకటించిన లాక్‍డౌన్‍ ప్రకటించిన కారణంగా ఈ అన్ని సినిమాల షూటింగ్‍ లూ ఆగిపోయాయి. అయితే ఇప్పుడు కీర్తి పెళ్లి త్వరలోనే జరిగే అవకాశం ఉందని అంటున్నారు. రాజకీయ నేపథ్యం ఉన్న రిచ్ బిజినెస్ మ్యాన్ తో కీర్తి పెళ్ళికి ఆమె కుటుంబం ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించిదని ప్రచ్జారం జరుగుతోంది. ఆ వరుడు కూడా కీర్తి కుటుంబానికి అత్యంత సన్నిహితుడడేనని ఈ ఏడాదిలోనే కీర్తి పెళ్ళి జరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే పెళ్ళి తర్వాత కీర్తి మనుపటిలాగానే సినిమాల్లో నటిస్తుందా లేదా అనేది మాత్రం ప్రస్తుతానికి అనుమానమే. 
 

More Related Stories