English   

అనుపమ లేడీ ఓరిఎంటేడ్ సబ్జెక్ట్...దర్శకుడు ఎవరంటే 

Anupama Parameswaran
2020-04-04 12:40:30

ప్రేమమ్ సినిమాతో తెరంగ్రేటం చేసిన అనుపమ ఇప్పుడు కెరీర్ లో కొంచెం ఇబ్బందుల్లో ఉంది. తెలుగులో ఆమె చేసిన గత మూడు సినిమాలు దెబ్బ వేశాయి. చివరిగా చేసిన రాక్షసుడు సినిమా ఆమెకు హిట్ ఇచ్చినా మంచి పేరు అయితే తెచ్చి పెట్టలేక పోయింది. అనుపమ ప్రస్తుతం సూపర్ హిట్ సినిమా “నిన్నుకోరి” తమిళ రీమేక్ మూవీతో సహా మరో మలయాళ మూవీ లో నటిస్తున్నారు. అయితే ఆమె కార్తికేయ 2 లో నిఖిల్ సరసన నటించనుందని ప్రచారం జరిగింది. ఇందులో నిజం ఎంతో ఇంకా తెలియకున్నా ఇప్పుడు ఈ సినిమాతో పాటు మరో సినిమా కూడా ఒప్పుకున్నట్టు ప్రచారం జరుగుతోంది.  

విలక్షణ దర్శకుడు రవిబాబు దగ్గర దర్శకత్వ శాఖ లో పనిచేసిన హనుమాన్ చౌదరి అనే ఆయన దర్శకత్వంలో అనుపమ హీరోయిన్ గా ఒక ఫిమేల్ సెంట్రిక్ మూవీ రూపొందనుందని అంటున్నారు. ఈ సినిమాని పీవీపీ బ్యానర్ మీద పీవీపీ నిర్మించనున్నట్టు చెబుతున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ పవర్ ఫుల్ గా ఉంటుందని అంటున్నారు. ఇప్పటిదాకా లవ్ స్టోరీస్ చేసిన అనుపమకి ఇది ఫస్ట్ ఫిమేల్ సెంట్రిక్ మూవీ అని చెప్పచ్చు. ఈ లాక్ డౌన్ అంతా పూర్తయ్యాక ఈ సినిమా ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు.

More Related Stories