English   

స్నేహం కోసం లాక్ డౌన్ ను అతిక్రమించిన విజయ్ సేతుపతి

 Vijay Sethupathi
2020-04-04 13:27:54

తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని హీరో విజయ్ సేతుపతి. విజయ్ తమిళ హీరో అయినప్పటికీ తెలుగు తమిళ భాషల్లో తన నటనతో అంతే కాకుండా మంచి మనసున్న హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. విజయ్ సేతుపతి ప్రస్తుతం స్టార్ హీరో స్టేటస్ ఉన్నప్పటికీ ఒక సాధారణ వ్యక్తిలా కనిపిస్తాడు. మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చిన ఆయన తన మూలాలను ఎప్పుడు మర్చిపోడు. అందుకే విజయ్ ని అభిమానించే వారికంటే ప్రేమించే వారే ఎక్కువ. సినిమాల్లో సైడ్ రోల్స్ చేసిన ఆయన హీరోగా ఎదగటానికి ఎంతో కష్టపడ్డాడు కూడా. విజయ్ త్రిష నటించిన 96 సినిమా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. కాగా ప్రస్తుతం విజయ్ ఆర్ఆర్ఆర్ సినిమాలో కూడా ఒక ముఖ్య పాత్రలో నటిస్తుండటం విశేషం.

అయితే విజయ్ లాక్ డౌన్ ను అతిక్రమించడానికి కారణం స్నేహితులతో పార్టీ కోసమో సరదా కోసమో కాదు. విజయ్ మిత్రుడు నెల్లాయ్ భారతి అనే వ్యక్తి కొద్దీ రోజులుగా అనారోగ్యం తో బాధపడుతున్నాడు. ఆరోగ్యం విషమించడంతో అతడు మరణించాడు. కాగా విషయం తెలుసుకున్న విజయ్ హుటా హుటిన తన మిత్రుని చివరి చూపు కోసం వెళ్ళాడు. మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చిన విజయ్ కి కష్టాలు ఎలా ఉంటాయో తెలుసు కాబట్టి తన స్నేహితుడి అంతక్రియలు దగ్గరుండి జరిపించాడు. అంతే కాకుండా స్నేహితుడి తల్లికి ఆర్ధిక సాయం కూడా చేసాడు. విజయ్ చేసిన పనికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. లాక్ డౌన్ ను అతిక్రమించినా ఒక పర్పస్ ఉందంటున్నారు. అలంటి సమయంలో విజయ్ చేసిన పనిని తప్పు పెట్టటమే పెద్ద తప్పు కదా మరి. విజయ్ చేసిన పనికి ఎవరైనా హాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే.   

More Related Stories