బికినీ వేసినా కూడా తెలుగుమ్మాయికి నో ఆఫర్స్..

ఇంతకంటే ఏం చేయాలి.. తెలుగమ్మాయిలు అందాలు ఆరబోయరని చెప్తారు.. బికినీలోనే అందాలన్నీ కెమెరా ముందు పరిచినా కూడా కొందరు అమ్మాయిలకు ఆఫర్లు రావడం లేదు. అందులో ముఖ్యంగా తేజస్వి మదివాడ గురించి చెప్పుకోవాలి. హాలీవుడ్ హీరోయిన్లకు ధీటుగా అందాలను ఆరబోసే ఈమెకు ఇప్పుడు అవకాశాలు రావడం లేదు. తాజాగా మరోసారి బికినీ షో చేసింది. ఈమె ఫోటోలు చూసి అయ్యో అడవి కాచిన వెన్నెల అయిపోతుందిగా ఈమె అందం అంటున్నారు అభిమానులు. మన అమ్మాయిలు గ్లామర్ షోకు దూరంగా ఉంటారనేది ఒకప్పటి మాట. అవకాశం రావాలే గానీ బాలీవుడ్ బ్యూటీస్ ను కూడా తమ గ్లామర్ తో డామినేట్ చేస్తాం అనేది నేటి ముద్దుగుమ్మల మాట.
ఇప్పటికే అంజలి, మధుశాలిని లాంటి భామలు అందాల ఆరబోతలో తమకు పెద్దగా హద్దులు లేవని చూపించారు. ఇప్పుడు వీళ్లందరికీ ధీటుగా వచ్చేస్తుంది తేజస్వి మదివాడ. సీతమ్మ వాకిట్లో..తో గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. వర్మ ఐస్ క్రీమ్ సినిమాతో వెలుగులోకి వచ్చేసింది. రెండేళ్ల కింద బిగ్ బాస్ 2లో కూడా వచ్చింది. అక్కడ ఎక్కువ రోజులు ఉండకపోయినా తన అందాలతో ఆకట్టుకుంది.ముఖ్యంగా సామ్రాట్ తో లవ్ స్టోరీ బాగా ఇంట్రెస్టింగ్ గా కూడా సాగింది. దాంతో తేజస్వికి బయట కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది. ఇదే అదునుగా ఇప్పుడు బయట కూడా అందాలనే నమ్ముకుంటుంది. ఒక్కో సినిమాతో పాపులారిటీ పెంచేసుకుంటుంది తేజస్వీ.
దిల్ రాజు కేరింతలో గ్లామర్ షోను సింగిల్ హ్యాండ్ తో హ్యాండిల్ చేసింది తేజస్వి. అందులో మిగిలిన ఇద్దరు హీరోయిన్లు పద్దతిగా కనిపిస్తే.. తేజస్వి మాత్రం హాట్ షోలతో పిచ్చెక్కించింది. ఆ తర్వాత కూడా చేసిన ప్రతీ సినిమాలోనూ గ్లామర్ షో చేసింది. గ్లామరస్ కారెక్టర్ లకు తేజు అడ్రస్ ప్రూఫ్ గా మారిపోతుంది. ఖాళీ టైమ్ లో హాట్ ఫోటో షూట్ లతో రెచ్చిపోతుంది కూడా. ఇప్పుడు కూడా బికినీ ఫోటోషూట్ చేసింది. దాంతో పాటు కమిట్ మెంట్ అనే వెబ్ సిరీస్ కూడా చేస్తుంది ఈ తెలుగమ్మాయి.