English   

సౌందర్యతో నాకు ఎఫైర్ ఉందంటున్న జగపతిబాబు..

jaga
2020-04-04 19:33:16

తెలుగు ఇండస్ట్రీలో శోభన్ బాబు, వెంకటేష్ తర్వాత ఆ స్థాయిలో లేడీస్ పాలోయింగ్ సంపాదించుకున్న హీరో జగపతిబాబు. 90ల్లో ఈయన చాలా ఫ్యామిలీ సినిమాలు చేసాడు. ఆ తర్వాత కూడా మంచి సినిమాలు చేసాడు. అయితే ఉన్నట్లుండి ఇమేజ్ మొత్తం పోయింది. ప్రస్తుతం కారెక్టర్ ఆర్టిస్టుగా సెట్ అయిపోయాడు జేబీ. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఈ మధ్యే ఈయన ఇచ్చిన ఇంటర్వ్యూలో జగపతిబాబు సంచలన విషయాలు బయటపెట్టాడు. తనకు అలనాటి నటి సౌందర్యతో ఎఫైర్ ఉందని చెప్పాడు. అవును అప్పట్లో సౌందర్యతో నాకు అఫైర్ ఉండేది.. కానీ అది మీరు అనుకుంటున్నట్లు లైంగిక సంబంధం కాదని చెప్పాడు జేబీ. ఆమె సోదరుడు అమర్ కూడా తనకు బాగా క్లోజ్ అని చెప్పాడు జగపతిబాబు. అందుకే అప్పుడప్పుడూ వారి ఇంటికి వెళ్లేవాడినని.. సౌందర్య కూడా తరుచూ తన ఇంటికి వచ్చేదని చెప్పాడు జేబీ.

కానీ అది చూసి ఆమె గురించి తప్పుగా అనుకునే వాళ్లు అని.. కానీ సౌందర్య అలాంటిది కాదని చెప్పాడు ఈయన. తమ బంధాన్ని కూడా ప్రజలు ఎప్పుడూ తప్పుగానే అర్థం చేసుకునే వారని సంచలన వ్యాఖ్యలు చేసాడు జగపతి బాబు. తమ బంధం గురించి ఎవరైనా మాట్లాడితే దాన్ని కాంప్లిమెంట్‌గానే తీసుకున్నానని చెప్పాడు ఈయన. అక్కడ దాచి పెట్టాల్సినంత తప్పు తామేం చేయలేదని.. మంచి స్నేహితులుగానే ఎప్పుడూ తాము ఉన్నామని చెప్పాడు జేబీ. తమపై వచ్చే రూమర్లను తాను ఎప్పుడూ పట్టించుకోలేదని చెప్పాడు ఈయన. ఎఫైర్ అంటే లైంగిక సంబంధం కలిగి ఉండటమని ఆలోచిస్తారు కానీ తమ మధ్య మంచి అనుబంధం ఉండేదని చెప్పాడు. అందుకే తనకు, నాకు ఎఫైర్ ఉందని చెప్పాడు జేబీ. మొత్తానికి ఈ వ్యాఖ్యలతో మరోసారి సంచలనం అయ్యాడు జగపతిబాబు.

More Related Stories