English   

టాలీవుడ్ పై ప్రధాని మోదీ స్పెషల్ కాన్సన్ట్రేషన్...

Narendra Modi Tweet.jpg
2020-04-04 22:19:40

బాలీవుడ్ తర్వాత తెలుగు ఇండస్ట్రీ ఇప్పుడు ఇండియాలో అతి పెద్దది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే బాహుబలి సినిమా తర్వాత అందరూ టాలీవుడ్ వైపు చూస్తున్నారు. ఇక్కడ హీరోలు కూడా బాలీవుడ్ కు మేమేమీ తీసిపోము అంటున్నారు. మన హీరోల ఇమేజ్ కూడా అలాగే ఉంది. దాంతో ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా తెలుగు ఇండస్ట్రీని ప్రత్యేకంగా ఫోకస్ చేశాడు. కరోనా వైరస్ అరికట్టడంలో మన హీరోలు అందరికంటే ముందున్నారు. ప్రజలను అప్రమత్తం చేయడంలో.. అభిమానులను జాగ్రత్త పరచడంలో మిగిలిన ఇండస్ట్రీ హీరోలతో పోలిస్తే తెలుగు హీరోలు కాస్త ముందున్నారు.

ముఖ్యంగా చిరంజీవి, నాగార్జున అయితే కరోనా వైరస్ గురించి అందరికీ అర్థమయ్యేలా చెబుతున్నారు. దానికితోడు చిరంజీవి, నాగార్జున, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ కలిసి ఒక పాటలో కూడా నటించారు. ఇది చూసి ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అందరికీ తెలుగులో ట్వీట్ చేసి ధన్యవాదాలు తెలిపాడు. ఇక ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు నరేంద్ర మోదీ. ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు లైట్స్ అన్ని ఆఫ్ చేసి ప్రధాని మోడీ చెప్పినట్లే చేద్దాం.. కరోనా వైరస్ లేని భారతదేశాన్ని సాధిద్దాం అంటూ రామ్ చరణ్ ట్వీట్ చేశాడు. ఇది చూసిన మోడీ ఇలాగే అందరినీ ప్రభావితం చేయండి వెల్డన్ అంటూ ట్వీట్ చేసాడు. కరోనా వైరస్ అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కూడా ఉన్నాయి.

ఇక్కడ మన హీరోలు చెబితే అభిమానులు వింటారు అని నమ్మిన ప్రధాని మోడీ ముఖ్యంగా తెలుగు హీరోలపై చేశాడు. ఇక్కడ ఏం చేసినా కూడా వెంటనే తన ట్విట్టర్లో పోస్ట్ చేస్తున్నాడు. దానివల్ల దేశమంతా అప్రమత్తం అవుతారని  ప్రధాని మోదీ భావిస్తున్నాడు.

More Related Stories