English   

అబ్బే అంతా ఒట్టిదేనట

mb
2020-04-05 07:08:19

ఈ సంవత్సరం సంక్రాంతికి ‘సరిలేరు నీకెవ్వరూ’ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాడు మహేష్ బాబు. అయితే మళ్ళీ తన తదుపరి సినిమాని తనకు మహర్షి వంటి సూపర్ హిట్ ఇచ్చిన వంశీ పైడిపల్లితో చేస్తున్నాడని ముందే క్లారిటీ ఇచ్చినా అది కార్యరూపం దాల్చలేదు. అయితే తరువాత అనూహ్యంగా మహేష్ పరశురామ్ కాంబినేషన్ సినిమా ఒకటి తెర మీదకు వచ్చింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రాలేదు కానీ సినిమా గురించి రకరకాల గాసిప్స్ మాత్రం తిరుగుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన మరో వార్త ప్రచారంలోకి వచ్చింది. అదేంటంటే ఈ సినిమాలో సూపర్ స్టార్ కు జంటగా కీర్తి సురేష్ నటించనుందని అంటున్నారు. తాజాగా ఆ సినిమాలో బాలీవుడ్ భామ నటించబోతున్నట్లుగా ప్రచారం మొదలయింది.

పరశురామ్ రశ్మికని సజెస్ట్ చేస్తే.. ఇప్పుడే సరిలేరు లో నటించా ఇక వద్దని మహేష్ చెప్పగా.. పరశురామ్ మహేష్ కోసం బాలీవుడ్ భామని తీస్కుంటున్నాడని, కాదు మహానటి కీర్తి సురేష్ ని ఎంపిక చేస్తున్నారని ప్రచారం జరిగింది. అయితే ఇంతవరకు మహేష్ కోసం పరశురామ్ హీరోయిన్ సెట్ చెయ్యలేదని అంటున్నారు. మహేష్ సినిమా కోసం డైలాగ్ వెర్షన్ తో బిజీగా ఉన్నాడని, అది పూర్తయ్యాక మహేష్ కి పూర్తి స్క్రిప్ట్ నేరేట్ చేశాకే నటీనటులు, హీరోయిన్ ఎంపిక మొదలెడతారని పరశురామ్ సన్నిహితుల ద్వారా అందుతున్న సమాచారం. అయితే మహేష్ మాత్రం ఎంత టైం అయినా తీసుకో..కానీ పని పర్ఫెక్ట్ గా ఉండాలని చెబుతున్నాడట.

 

More Related Stories