English   

లాక్ డౌన్ లోనూ మారరా ? మద్యం మత్తులో యాక్సిడెంట్ చేసిన హీరోయిన్

accident
2020-04-05 16:19:12

ఊరందరిదీ ఒక దారి అయితే ఉలిపి కట్టెది మరో దారి అని, దేశం అంతా లాక్ డౌన్ లో ఉంటే ఆ హీరోయిన్ మాత్రం రోడ్డెక్కింది. అది కూడా జనానికి ఏదో సేవ చేయడానికి కాదు తన స్నేహితుడితో కలిసి జాలీ రైడ్ కోసం. బెంగళూరు రహదారులు భవిష్యత్తులో ఇలా ఉండవని అనుకుందో ఏమో జాం జాం అంటూ రేసుకు వెళ్లినట్టు వెళ్లి యాక్సిడెంట్ చేసుకుంది. ఆమె పేరు షర్మిలా మాండ్రే కన్నడ నటి, తెలుగులో కూడా అల్లరి నరేష్ సరసన కేవ్వుకేక అనే సినిమాలో నటించింది ఈ హీరోయిన్. ఈ ప్రమాదంలో ఆమె ముఖానికి, చేతికి తీవ్రంగా గాయాలైనట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటన బెంగళూరులోని వసంత్‌ నగర్‌ రైల్వే బ్రిడ్జి వద్ద నిన్న ఉదయం 3 గంటల సమయంలో జరిగినట్లు తెలుస్తోంది. షర్మిల తన స్నేహితుడు లోకేష్‌ తో కలిసి తన హై ఎండ్ జాగ్వర్ కారులో వెళుతుండగా అతివేగం కారణంగా కారు అదుపు తప్పి పక్కన ఉన్న స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో షర్మిలతోపాటు ఆమె ఫ్రెండ్ ‌కు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద తాకిడికి కారు ముందు భాగం నుజ్జనుజ్జైంది. షర్మిల, లోకేష్‌‌లు ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు. కాగా ప్రమాదానికి సంబందించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదానికి గురైన సమయంలో వీరు మధ్యం మత్తులో ఉన్నట్లు సమాచారం.  ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

More Related Stories