ఎందుకు మోడీ తెలుగు హీరోల మీద పడినట్టు

మునుపెన్నడూ లేని విధంగా పీఎం మోడీ టాలీవుడ్ మీద కాన్సంట్రేట్ చేసినట్టు తెలుస్తోంది. కరోనా వైరస్ పై ప్రజల్లో అవగాహన కల్పించినందుకు తెలుగు సినీ తారలకు మొన్న అభినందనలు తెలిపారు ప్రధాని మెడీ. తెలుగులో ట్వీట్ చేసి మరీ వారిని అభినందించారు. కరోనా వైరస్ ప్రభావంతో దేశమంతా లాక్ డౌన్ అయ్యింది. ఈ పరిస్థితుల్లో ప్రజల్లో కరోనా వైరస్ గురించి అవగాహన కల్పిస్తూ సినీ తారలు పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అందరినీ ఇళ్లకే పరిమితం కావాలంటూ సూచనలు చేస్తున్నారు. చిరంజీవి, నాగార్జున, వరుణ్ తేజ్, సాయి తేజ్ కలిసి కోటి సంగీత సారథ్యంలో రూపొందించిన ఓ స్పెషల్ సాంగ్‌లో నటిస్తూ కరోనా వైరస్ ప్రభావాన్ని నివారించడానికి సామాజిక దూరం పాటించాలన్నారు. దీని గురించి ప్రధాని మోడీ ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ చిరంజీవి, నాగార్జున, వరుణ్ తేజ్, సాయి తేజ్‌లను అభినందిస్తూ తెలుగులో ట్వీట్ చేశారు. చిరంజీవి, నాగార్జున, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్‌కు ధన్యవాదాలు తెలిపారు. అందరం మన ఇళ్ళల్లోనే ఉందాం.అందరం సామాజిక దూరం పాటిద్దాం. కరోనా వైరస్ పై విజయం సాధిద్దాం అని పిలుపునిచ్చారు ప్రధాని మోడీ. ఇక ఈరోజు మోడీ రాత్రి తొమ్మిది గంటలకి తొమ్మిది నిమిషాల పాటు దీపాలు వెలిగించాలని పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందే.
మోడీ ఇచ్చిన పిలుపుకు అన్ని వర్గాల నుంచి మంచి స్పందన వస్తుంది. ఇక తెలుగు చిత్రపరిశ్రమ నుంచి అగ్రహీరోలు చిరంజీవి, నాగర్జున మద్దతు తెలుపుతూ ప్రధాని ఇచ్చిన పిలుపును పాటించి కరోనా వైరస్ ని తరిమికొట్టాలని పిలుపునిస్తూ వీడియోలు విడుదల చేశారు. మెగాహీరో రామ్ చరణ్ కూడా ఒక వీడియో చేశారు. ఇళ్ళలో లైట్లు ఆర్పేసి.. దీపాలు వెలిగిద్దాం.. మన ప్రధానమంత్రి మాట పాటిద్దాం.. కరోనాలేని భారత్‌ను డెఫినెట్‌గా సాధిద్దామని రామ్ చరణ్ ఈ వీడియోను తన ఇన్‌స్టా గ్రామ్ లో పోస్టు చేశారు. ఈ వీడియోని మోడీ రీట్వీట్ చేశారు. రీట్విట్ చేస్తూ ప్రధాని రామ్ చరణ్ ను ఉద్దేశించి కామెంట్ కూడా చేశారు. బాగా చెప్పావ్... లాక్‌డౌన్‌ను అనుసరిస్తూ.. వెలుగుల్ని ప్రసరింపచేయాలని మోదీ తన ట్వీట్లో కోరారు. అయితే ఎన్నడూ లేనిది మోడీ ఎందుకు ఇలా తెలుగు హీరోలను ఎంకరేజ్ చేస్తూ ప్రత్యేక శ్రద్ధ చూపెడుతున్నారు ? అనే సందేహాలు కలుగుతున్నాయి.