కరోనా బ్రేక్ ని బాగా వాడుతున్న హీరోలు

కరోనా కాటుకు దేశాలు స్థంబించిపోయాయి. ఎక్కడికక్కడ అన్ని పనులు నిలిచిపోయాయి. మన తెలుగు సినిమా కూడా ఎక్కడికక్కడ స్థంబించింది. షూటింగ్ లు ఏవీ లేక దాదాపు సినీ పరిశ్రమకు చెందిన అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే అనుకోకుండా వచ్చిన ఈ బ్రేక్ ని ఒక్కక్కరు ఒక్కో విధంగా వాడుకుంటున్నారు. కొంత మంది పూర్తిగా రెస్ట్ తీసుకోవడానిక్ వాడుతుంటే కొందరు హీరోలు మాత్రం ఈ బ్రేక్ ని తమ లుక్కులు మార్చుకోవడానికి ఉపయోగిస్తున్నారు అందులో నిఖిల్, మంచు మనోజ్ లు ముందున్నారు. నిఖిల్ ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో కార్తికేయ సీక్వెల్ ‘కార్తికేయ 2’ను ప్రారంభించగా.. మనోజ్ ‘అహం బ్రహ్మాస్మి’ అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే మొదలయిన ఈ రెండు సినిమాలు రెగ్యులర్ షూటింగ్ కి వెళ్ళాల్సి ఉండగా కరోనా వలన తాత్కాలికంగా ఆగిపోయాయి.
అయితే ఈ బ్రేక్ ని హీరోలు చక్కగా ఉపయోగించుకుంటున్నారు. నిఖిల్ ఈ సినిమా కోసం సిక్స్ ప్యాక్ ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని మనోడే స్వయంగా ట్విటర్ ద్వారా పంచుకున్నాడు. మరో పక్క మంచు మనోజ్ కూడా అహం బ్రహ్మాస్మి కోసం ఓ కొత్త లుక్‌ను ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ లాక్డౌన్ కాలాన్ని తన లుక్ కోసం వినియోగిస్తున్నట్లు తాజాగా ట్విటర్ వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేశారు. వీటిలో ఆయన కోర మీసాలు, క్లీన్ షేవ్‌తో మాస్ లుక్ లో కనపడుతున్నాడు. షూటింగ్ లు లేక ప్రస్తుతం ఇంట్లోనే గడుపుతున్న ఈ బ్రేక్ లో కొత్త లుక్ ట్రై చేశా ఇలా క్లీన్ షేవ్‌లో నన్ను నేను చూసుకోవడం చాలా బాగుంది. అందరూ ఈ కాలాన్ని నాలాగే మంచికి వాడుకోడానికి ట్రై చేయండిని ఆ ఫొటోలకు కామెంట్స్ చేశారు.