English   

పవన్ సినిమాలో రంగస్థలం భామ స్పెషల్ సాంగ్

pk
2020-04-05 10:17:34

పవర్ స్టార్ ప‌వ‌న్‌ కున్న డిమాండ్ ఏమాత్రం తగ్గలేదని జనానికి ఒకరకంగా క్లారిటీ వచ్చింది. మొన్నీమధ్య విడుద‌లైన వ‌కీల్ సాబ్‌ ఫ‌స్ట్ లుక్ టైటిల్ పోస్టర్‌, మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా రిలీజ్ చేసిన లిరిక‌ల్ వీడియో సాంగ్‌కు వ‌చ్చిన రెస్పాన్స్ చూశాక ప‌వ‌ర్‌ స్టార్ క్రేజ్ ఏ మాత్రం త‌గ్గలేద‌ని క్లారిటీ వ‌చ్చేసింది. అయితే ఇక సినిమాలే లేవనుకున్న పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఒకేసారి మూడు సినిమాలు ఒప్పుకుని చేసుకుంటూ పోతున్నారు. మూడు సినిమాల్లో క్రిష్ తో కూడా ఒక సినిమా చేస్తున్నారు. పీరియాడికల్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ కూడా అయిపోయింది. అయితే ఈ కరోనా కాటుకు అన్ని సినిమాల లానే ఈ సినిమా షూట్ కూడా ఆగిపోయింది అనుకోండి అది వేరే విషయం. అయితే ఓ పక్క షూటింగ్ కొంత జరుపుకున్నా హీరోయిన్ గురించి మాత్రం క్లారిటీ రాలేదు. ఈ సినిమాలో కధ ప్రకారం ముగ్గురు హీరోయిన్స్ ఉంటారని అంటున్నారు. ఇందులో నిజం ఎంత ఉందొ తెలీదు కానీ ఆ ముగ్గురిని ఎంపిక చేయడమే పెద్ద తలనొప్పిగా మారిందట క్రిష్ కి. అయితే వారి మీద ఇంకా క్లారిటీ రాకున్నా ఈ సినిమాలో పూజిత పొన్నాడ స్పెషల్ సాంగ్ ఒకటి చేయనుందని అంటున్నారు. ఈ సినిమాలో పవన్‌ బందిపోటుగా నటించనున్నారన్న సంగతి తెలిసిందే. పూజిత తొలుత నారా రోహిత్‌తో నటించిన ‘తుంటరి’ చిత్రంతో వెండితెరకు పరిచయమైంది. ఆ తరువాత ‘రంగస్థలం’లో ఆది ప్రేమికురాలిగా రాజశేఖర్‌ ‘కల్కి’లో పోలీస్ ఆఫీసర్ గా నటించింది. అయితే అనుకున్నంత క్రేజ్ అయితే రాలేదు. మరి ఈ స్పెషల్ సాంగ్ తో అయినా ఆమె కెరీర్ గాడిలో పడుతుందేమో చూడాలి.  

 

More Related Stories