English   

రవితేజ - రమేష్ వర్మ మూవీ...ఆ తమిళ్ సినిమా రీమేక్

rt
2020-04-05 10:27:57

డిస్కో రాజా సినిమాతో మరో డిజాస్టర్ రుచి చూసిన రవితేజ ప్రస్తుతం ‘క్రాక్’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు మనోడికి కలిసి వచ్చిన గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఈ ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు వచ్చేలా ప్లాన్ చేశారు. అయితే కరోనా దెబ్బకు ఆ సినిమా విడుదల వాయిదా పడినట్టే. అయితే ఇక ఈ సినిమాతో పాటు రవితేజ మరో సినిమాలో నటించబోతున్నాడు. రాక్షసుడు ఫేం రమేష్‌ వర్మ దర్శకత్వంలో ఆయన ఒక సినిమా ఒప్పుకున్నాడు. ‘రాక్షసుడు’తో విజయాన్ని అందుకున్న రమేష్‌ వర్మ చెప్పిన కథకి రవితేజ బాగా కనెక్ట్ అయ్యారని ప్రచారం జరిగింది. క్రాక్ పూర్తి కాగానే ఈ సినిమా షూటింగ్ కూడా త్వరలోనే మొదలు కావాల్సి ఉంది. అయితే కరోనా బ్రేక్ వేసింది అనుకోండి. అయితే ఈ సినిమాలో రవితేజకు జోడీగా నటించనున్న భామ ఈమెనే అంటూ పలువురి పేర్లు బయటకు వచ్చాయి. అందులో ఇంకా క్లారిటీ లేదనుకోండి. అయితే ఈ సినిమా కధ గురించి మరో ఆసక్తికర వార్త ప్రచారంలోకి వచ్చింది. అదేంటంటే ఈ సినిమాని రిలీజ్ కి నోచుకోని ఒక తమిళ సినిమాకి రీమేక్ అని అంటున్నారు. అరవింద స్వామి హీరోగా త్రిష హీరోయిన్ గ సతురంగ వెట్టై 2, 1818 అనే థ్రిల్లర్ సినిమా రిలీజ్ కావలసి ఉంది. అది 2018 నుండి ఇప్పటిదాకా రిలీజ్ కాలేదు. ఆ సినిమానే ఇప్పుడు రమేష్ వర్మ హక్కులు కొని మరీ సినిమా చేస్తున్నట్టు చెబుతున్నారు. రాచ్చసన్ సినిమాని రాక్షసుడిగా తీర్చిదిద్దిన ఈయన ఈ సినిమాని ఏమి చేస్తాడో చూడాలి మరి.

 

More Related Stories