English   

లాక్ డౌన్ ఎఫెక్ట్ : అలా మహేష్ కి స్ప్రిప్ట్ పంపిన పరశురామ్

mahesh
2020-04-05 11:02:24

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఈ ఏడాది సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ కొట్టాడు. ఒక రకంగా ఇది ఆయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అని చెప్పొచ్చు. ఈ సినిమా వెండితెర మీదనే కాక బుల్లి తెర మీద కూడా సంచలనం సృష్టించింది. మొన్న ఉగాదికి ఈ సినిమాని టివీలో ప్రదర్శిస్తే అత్యధిక టిఆర్పీ సాధించిన తెలుగు సినిమాగా రికార్డులకెక్కింది. సరిలేరు నీకెవ్వరు తర్వాత బ్రేక్ తీసుకున్న మహేష్ కొత్త సినిమా మొదలు పెట్టాల్సి ఉంది. అయితే కరోనా లాక్ డౌన్ కారణంగా అది వాయిదా పడింది. అయితే తన తర్వాతి సినిమా విషయంలో ఇప్పటికే ఒక క్లారిటీకి ఒచ్చేసాడు. ముందు వంశీ పైడిపల్లితో అనుకున్నా కానీ పరశురామ్ తో చేస్తున్నట్టు ఖరారు అయినట్టే. ఇక తాజాగా సినిమా స్క్రిప్ట్ మొత్తాన్ని మహేష్ కి మెయిల్ చేశాడట పరశురామ్. లాక్ డౌన్ కారణంగా బయటకు వెళ్ళలేని ఆయన మహేష్ కి పంపాడని ఏమైనా కరెక్షన్స్ ఉంటే చూసుకుని ప్రీ ప్రొడక్షన్ కూడా మొదలు పెట్టవచ్చని అంటున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ విషయంలో కొన్ని రోజులుగా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో బాలీవుడ్ హీరోయిన్లు సారా అలీ ఖాన్ లేదా కియారా అద్వానీ హీరోయిన్లుగా నటిస్తారని అంటున్నారు. చూడాలి మరి ఎవరిని కన్ఫర్మ్ చేస్తారో ?

More Related Stories