English   

లింగం మామ కొడుకు ఎంట్రీ..అర్జున్ రెడ్డి భామతో

aditya
2020-04-05 11:13:37

మన సినిమాల్లోకి వారసులు రావడం కొత్త ఏమీ కాదు. అయితే వచ్చాక నిలబడడం లేదా పడిపోవడం అనేది వారి వారి టాలెంట్ అలాగే అదృష్టం మీద ఆధార పడిఉంటుంది. తెలుగులో శంకర్ దాదా లాంటి సినిమాల్లో నటించిన బాలీవుడ్ నటుడు పరేష్ రావాల్ కొడుకు ఆదిత్య రావల్ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా నటనా ప్రపంచంలోకి ప్రవేశించనున్నారు. జీ 5 స్పెషల్ బొంబార్డ్‌తో ఆయన ఎంట్రీ ఇస్తున్నాడు. రంజన్ చందేల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అర్జున్ రెడ్డి భామ షాలిని పాండే నటిస్తోంది. ఇటీవల పరేష్ రావల్ స్వయంగా తన కుమారుని తొలి చిత్రం గురించి సోషల్ మీడియాలో పరిచయం చేశారు. అలహాబాద్‌ కేంద్రంగా జరిగిన ఒక లవ్ స్టోరీ నేపథ్యంలో ఈ సినిమాని జార్‌ పిక్చర్స్, షైకా ఫిల్మ్స్‌ సంయుక్తంగా తెరకెక్కించాయి. నేచురల్ స్టార్  నాని హీరోగా వచ్చిన ‘ఎంసీఏ’లో చిత్రంలో విలన్‌గా నటించిన విజయ్‌ వర్మతో పాటు జతిన్‌ సర్నాలు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చిత్రాన్ని ఏప్రిల్‌ 10న జీ5 యాప్ లో విడుదల చేయనున్నారు. ఇక ఈ సందర్భంగా బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ నూతన హీరో ఆదిత్యను అభినందించారు.... వారసత్వాన్ని అనుసరిస్తున్న పరేష్ రావల్ కుమారుడు ఆదిత్యకు శుభాకాంక్షలు. ఆల్ ది బెస్ట్.. అని ఆయన ట్వీట్ చేశారు.  

 

More Related Stories