English   

రిలీజ్ డేట్ ఫిక్స్ అట...ఆరోజునే వరుణ్ తేజ్ బాక్సర్

boxer
2020-04-05 11:19:14

మెగాఫ్యామిలీ హీరోలకు ఫుల్ మాస్ ఫాలోయింగ్ ఉంటుంది. అయితే ఈ ఫ్యామిలీ నుంచే వచ్చిన వరుణ్ తేజ్ మాత్రం మాస్ స్టోరీస్‌కి దూరంగా కొత్త కొత్త కథాంశాలు ఎంచుకుంటున్నాడు. మొదటి నుంచే సమ్‌థింగ్‌ స్పెషల్‌గా కనిపించడానికి ప్రయత్నిస్తోన్న వరుణ్, ఇప్పుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో బాక్సింగ్‌ నేపధ్యంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో విలన్ గా నవీన్ చంద్రను ఎంపిక చేసినట్టు కూడా తాజాగా ప్రచారం జరిగింది. ఆ విషయం మీద క్లారిటీ రాకున్నా ఈ చిత్రంలో కన్నడ స్టార్‌ ఉపేంద్ర కీలక పాత్ర పోషించనున్నట్లు కూడా మరో కొత్త ప్రచారం మొదలయింది.  ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. కానీ కరోనా వల్ల ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇక అయితే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ విషయంలో టెన్షన్ లో ఉన్నారట మేకర్స్.

ఈ సినిమాను జూలై 30వ తేదీన విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారట ఈ సినిమా మేకర్స్. లాక్ డౌన్ అయిపోయిన తర్వాత గ్యాప్ లేకుండా షూటింగ్ జరిపి జూలై 30న రిలీజ్ చేయాలనుకుంటున్నారట మేకర్స్. ఈ సినిమాని మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రినైస్సన్స్ పిక్చర్స్, బ్లూ వాటర్స్ క్రియేటివ్ బ్యానర్స్ పై అల్లు బాబీ, సిద్దు ముద్దలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నిర్మాత అల్లు అరవింద్ తనయుడు బాబీ ఈ సినిమాతోనే టాలీవుడ్ కు నిర్మాతగా పరిచయమవుతున్నారు. ఇందులో ప్రముఖ బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్ కుమార్తె సాయి మంజ్రేకర్ కథానాయికగా నటిస్తుందని ప్రచారం జరుగుతున్న అందులోనూ క్లారిటీ లేదు. ఇక థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి మరి.

More Related Stories