English   

విజయ్ దేవరకొండను మిస్సవుతున్నానంటున్న హీరోయిన్

ananya
2020-04-05 16:23:57

కరణ్ జోహార్ నిర్మాణంలో తెరకెక్కిన ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ సినిమాతో బాలీవుడ్ కి హీరోయిన్‌గా పరిచయమైంది బాలీవుడ్ నటుడు చుంకీ పాండే కూతరు అనన్య పాండే. తాజాగా ఈమె విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేస్తోన్న ప్యాన్ ఇండియా మూవీ ‘ఫైటర్’(వర్కింగ్ టైటిల్) సినిమాతో తెలుగు తెరకు పరిచయం కానుంది. అయితే ఆమె తాజాగా చేసిన కామెంట్స్ రచ్చ రేపుతున్నాయి. నిజానికి గత కొద్దికాలంగా ఫైటర్ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతోని. అయితే కరోనా వల్ల ఈ షూటింగ్ కు బ్రేక్ పడటంతో ఎవరి ఇళ్లకు వాళ్ళు చేరారు. దీంతో కొద్ది రోజులుగా ఎవరి ఇళ్ళకి వారే పరిమితం అవడంతో తను విజయ్ ను చాలా మిస్ అవుతున్నట్టు చెబుతోంది ఈ భామ. ఆ మధ్య వీరిద్దరూ హాగ్ చేసుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో విజయ్ కూర్చుని ఉండగా అనన్య నుంచుని ఉంది, సో మనోడు హాగ్ చేసుకునేప్పుడు సరిగ్గా ఆమె ఎద భాగానికి దగ్గరగా మొహం పెట్టి హాగ్ చేసుకున్నాడు. దీంతో విజయ్ మీద ఒక రేంజ్ లో ట్రోల్స్ చేశారు. ఎవరెన్ని ట్రోల్స్ చేస్తేనేమి మనోడు మాత్రం ఆ పాపను బాగా ఇంప్రెస్ చేసినట్టున్నాడు. అందుకే మిస్సవుతోంది ఆ భామ. పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెలుగు, హిందీ భాషలలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందించనున్నారు.

 

More Related Stories