English   

నాకు రామ్ చరణ్, మహేష్ ఒక్కటే అంటున్న చిరంజీవి..

mahesh
2020-04-05 16:57:52

ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద దిక్కు చిరంజీవి ఒక్కడే. అన్నీ ఆయనే దగ్గరుండి చూసుకుంటున్నాడు. దాంతో పాటు హీరోలందరికీ కూడా పెద్దన్నగా మారిపోతున్నాడు మెగాస్టార్. ఇప్పుడు లాక్ డౌన్ సందర్భంగా అభిమానులతో సోషల్ మీడియాలో ముచ్చటించాడు మెగాస్టార్. అందులో చాలా ప్రశ్నలకు సమాధానమిచ్చాడు చిరు. ముఖ్యంగా మహేష్ బాబుతో ఆచార్యలో కలిసి నటించే విషయంపై కూడా క్లారిటీ ఇచ్చాడు చిరు. అసలు ఈ సినిమాలో మహేష్ ఉన్నాడని ఎవరు చెప్పారని ప్రశ్నించాడు చిరు. ముందు నుంచి కూడా ఈ సినిమాలో రామ్ చరణ్ నటించాలని అనుకుంటున్నాడని.. ఆయన్నే తీసుకోవాలని అనుకుంటున్నట్లు చెప్పాడు చిరంజీవి. మధ్యలో మహేష్ బాబు పేరు ఎందుకొచ్చిందో తెలియదంటున్నాడు చిరంజీవి. అయినా కూడా మహేష్ కూడా నాకు బిడ్డతో సమానం.. అతనితో కలిసి నటించడం నాకు ఆనందం కలిగించే అంశమే అని చెప్పాడు మెగాస్టార్. అయితే ముందు నుంచి అందరూ అనుకుంటున్నట్లు అసలు ఆచార్యలో మహేష్ బాబును తీసుకోవాలని కొరటాల అయితే అనుకోలేదని క్లారిటీ ఇచ్చాడు ఈయన. ఈ పాత్ర రామ్ చరణ్ చేస్తే బాగుంటుందని కొరటాల కూడా భావించాడని.. అదే వాళ్ల అమ్మ సురేఖ కోరిక కూడా అని చెప్పాడు మెగాస్టార్. కానీ దీనికి రాజమౌళి అనుమతి కావాలని చెప్పాడు చిరంజీవి. ప్రస్తుతం RRR సినిమాతో బిజీగా ఉన్న చరణ్.. తన సినిమాలో నటించాలంటే రాజమౌళి ఒప్పుకోవాలని చెప్పాడు. దీనికి కొరటాల, రాజమౌళి కూర్చుని మాట్లాడుకోవాలని సెలవిచ్చాడు. రామ్ చరణ్ కొణిదెల బ్యానర్‌తో కలిసి కాగా మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఆచార్య సినిమాను నిర్మిస్తున్నాడు.

More Related Stories