English   

వాళ్ల దగ్గర డబ్బుల్లేవా.. అన్నీ ఫ్లాప్ సినిమాలే తీసారా..

tollywood
2020-04-05 17:27:29

ఎవరికి ఈ ప్రశ్నలు అనుకుంటున్నారా..? ప్రస్తుతం కొన్ని నిర్మాణ సంస్థలకు సోషల్ మీడియాలో ఎదురవుతున్న ప్రశ్నలే ఇవి. ఓ వైపు కరోనా మహమ్మారి దేశాన్ని పట్టి పీడిస్తుంది. మరోవైపు సినిమా కార్మికులు కూడా పూట గడిస్తే చాలని అల్లాడిపోతున్నారు. ఇలాంటి సమయంలో విరాళం ఇవ్వడం కనీస బాధ్యతగా ఫీల్ అవుతున్నారు మన హీరోలు.. దర్శక నిర్మాతలు. ఇప్పటి వరకు బాగానే ఇచ్చారు కానీ కొందరు మాత్రం ఇంకా స్పందించడం లేదు. ముఖ్యంగా టాలీవుడ్ లో బడాబడా నిర్మాతలు కొందరు ఇంకా నోరు మూసుకుని కూర్చున్నారు. కనీసం కొన్ని డబ్బులు కూడా ఇవ్వడానికి వాళ్లకు మనసు రావడం లేదు. మరికొందరు అయితే కోట్లకు కోట్లు సంపాదించుకుంటూ ముష్టి వేసినట్లు కాస్త విరాళమే ఇచ్చారు. ఇది చూసి నెటిజన్లు మండిపడుతున్నారు. మా డబ్బులు కోట్లకు కోట్లు బాగానే తింటున్నారు. ఇండస్ట్రీ మీద పడి బాగానే బ్రతుకుతున్నారు. అలాంటిది మీ తోటి కార్మికులు బాధల్లో ఉంటే.. వాళ్లు కష్టాల్లో ఉంటే ఆదుకోవాల్సిన బాధ్యత మీపై లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికీ కొందరు స్పందించకపోవడంతో సోషల్ మీడియాలో వాళ్లపై విమర్శలు ఎక్కువైపోతున్నాయి. ఇప్పటి వరకు మీ నిర్మాణ సంస్థల్లో నుంచి వచ్చిన సినిమాలు బ్లాక్ బస్టర్స్.. సూపర్ హిట్స్ అని చెప్పుకుంటారు కదా మరి ఇప్పుడు సైలెంటుగా ఉన్నారంటే నష్టాల్లో ఉన్నారా.. మీరు తీసిన సినిమాలన్నీ చెత్త సినిమాలేనా అని అడుగుతున్నారు. ఇంత జరుగుతున్నా కూడా వాళ్లలో మాత్రం చలనం కనిపించడం లేదు. మరి నిజంగానే వాళ్లు చేసిన సినిమాలు చెత్తేనా.. కావాలనే వాళ్లకు వాళ్లే డబ్బా కొట్టుకుంటున్నారా..?

More Related Stories