English   

మోహన్ లాల్ చనిపోయాడంటూ ఫేక్ న్యూస్.. కంగారులో ఫ్యాన్స్..

mohanlal
2020-04-05 17:51:31

ప్రపంచం ఎలా ఉన్నా కూడా కొందరు ఎదవలు మాత్రం వాళ్ల పనులు వాళ్లు చేస్తుంటారు. కంగారు పెట్టడం ఒక్కటే వాళ్లకు తెలిసిన పని. సెలబ్రిటీస్ లైఫ్ లతో ఆడుకోవడం.. వాళ్ల ఆరోగ్యాలతో చెడుగుడు ఆడటమే వాళ్లకు తెలిసిన పని. ఇప్పుడు కూడా ఇదే చేసాడు ఓ వెదవ. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌తో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి సమయంలో దాన్ని ప్రముఖులకు కూడా అంటించి లేని అనారోగ్యాన్ని తీసుకొస్తున్నారు కొందరు ఆకతాయిలు. మన దేశంలో చూసుకుంటే కేరళలో కరోనా విజృంభన భారీగానే ఉంది. దాంతో అక్కడి హీరోలకు దీన్ని అంటించే ప్రయత్నం చేస్తున్నారు.. అలా ఫేక్ న్యూస్ క్రియేట్ చేస్తున్నారు. కేరళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కరోనా సోకి చనిపోయాడంటూ ఓ యవకుడు సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ చేసారు. ఏ మాత్రం బాధ్యత లేకుండా ప్రవర్తించిన ఈయనపై మోహ‌న్‌ లాల్ ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. వెంటనే ఆ పోస్ట్‌ను డిలీట్ చేయించడమే కాకుండా ఆ పోస్ట్ పెట్టిన వాన్ని కూడా పోలీసులకు పట్టించారు. వెంటనే రంగంలోకి దిగిన కేరళ పోలీసులు ఆకతాయి తిక్క కుదురుస్తున్నారు. ఇలాంటి పిచ్చి పనులు చేస్తే తాట తీస్తామని చెప్పినా కూడా కొందరు హద్దులు మీరుతున్నారు. ఇప్పుడు ఇదే జరిగింది. మోహన్ లాల్ ఘటనే దీనికి నిదర్శనం. ఇలాంటి వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు అభిమానులు.

More Related Stories