English   

రాజమౌళి దగ్గర లాక్ అయిపోయిన కొరటాల, త్రివిక్రమ్..

telugu
2020-04-05 18:07:20

అదేంటి.. వీళ్లు దర్శకులే.. వాళ్లు కూడా అదే. దానికితోడు ఎవరి పని వాళ్లు చేసుకుంటున్నారు కదా.. అలాంటప్పుడు రాజమౌళి దగ్గర వాళ్లు లాక్ కావడం ఏంటి అనుకుంటున్నారా..? ఇప్పుడు ఇదే జరుగుతుంది. ప్రస్తుతం ఈయన RRR సినిమాతో బిజీగా ఉన్నాడు. అయితే ఎప్పుడూ ఓ హీరోతో సినిమా చేసే దర్శక ధీరుడు.. ఈ సారి మాత్రం ఇద్దరు హీరోలను తన దగ్గర లాక్ చేసుకున్నాడు. ఓ వైపు రామ్ చరణ్.. మరోవైపు ఎన్టీఆర్ ఇద్దరూ రాజమౌళి రాజ్యంలో ప్రస్తుతం బంధీలుగా ఉన్నారు. ఎప్పుడు వాళ్ళకు విముక్తి అనేది కూడా తెలియదు. త్వరలోనే అంటున్నాడు కానీ ఆ త్వరలో ఎప్పుడు అనేది మాత్రం ఇంకా తేలలేదు. దాంతో వాళ్ళతో సినిమాలు కమిటైన ఇతర దర్శకులు టెన్షన్ పడుతున్నారు. ముఖ్యంగా చిరంజీవితో సినిమా చేస్తున్న కొరటాల.. ఇందులో కీలక పాత్ర కోసం చరణ్ ను తీసుకున్నాడు. కానీ రాజమౌళి ఒప్పుకుంటే కానీ ఈ సినిమా చేయడం సాధ్యంకాదు. మరోవైపు త్రివిక్రమ్ కూడా ఎన్టీఆర్ సినిమాకు కమిటయ్యాడు. అయితే అక్కడ కూడా సేమ్ సీన్. రాజమౌళి రిలీజ్ చేస్తే కానీ ఎన్టీఆర్ ఇక్కడికి రాలేడు. దాంతో ప్రస్తుతం రాజమౌళి దగ్గర చరణ్, ఎన్టీఆర్ మాత్రమే కాదు.. కొరటాల, త్రివిక్రమ్ కూడా లాక్ అయిపోయారు. మరి వాళ్లకు విడుదలెప్పుడో చూడాలి.

More Related Stories