ట్విట్టర్ లో జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్న పవన్...

పవన్ కళ్యాణ్ అటు రాజకీయాలను ఇటు సినిమాలను బ్యాలన్స్ చేస్తూ ముందుకెళుతున్నారు. తాజాగా తమిళనాడు లో చిక్కుకున్న మత్స్య కారులను ఏపీకి రప్పించి ఆయన ప్రశంసలు పొందారు. ఇక సినిమాల విషయానికొస్తే ఏకంగా 4 సినిమాలకు ఒకే చెప్పసారు. కాగా వకీల్ సాబ్ సినిమా షూటింగ్ ను ప్రారంభించుకుని కొంతవరకు చిత్రించారు కూడా ఆ తరువాత తీయబోయే పవన్ 27వ సినిమా కూడా సెట్స్ పైకి వెళ్లగా కరోనా కారణంగా దానికి బ్రేక్ పడింది. ఇక 28,29 సినిమాలకు కూడా ప్రణాళికలు సిద్ధం చేసారు.
ఇదిలా ఉండగా ట్విట్టర్ లోకి లేటుగా వచ్చిన లేటెస్టుగా వచ్చినట్టు ఉంది పవన్ కళ్యాణ్ ఎంట్రీ. తక్కువ కాలంలోనే పవన్ ట్విట్టర్ లో తన అభిమానుల సంఖ్యను పెంచుకున్నాడు. ఇక టాలీవుడ్, బాలీవుడ్ లలోను పవన్ ను ఫాలో అయ్యేవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. బాలీవుడ్ దర్శకుడు నటుడు శేఖర్ కపూర్ పవన్ ను ఫాలో అవుతుండగా తాజాగా సంగీత దర్శకుడు థమన్ కూడా ఈ జాబితాలో చేరారు. కాగా పవన్ కు ఇదివరకు కూడా ఒక ట్విట్టర్ అకౌంట్ ఉండేది అయితే అది జనసేన పేరుతో పార్టీ కార్యకలాపాలకోసం ఏర్పాటు చేసిన అకౌంట్.