English   

కోడలికి థ్యాంక్స్ చెప్పిన మెగాస్టార్ చిరంజీవి..

chiru
2020-04-06 07:27:13

తెలుగు సినిమా కార్మికుల కష్టాలను అంతా కలిసి పంచుకుంటున్నారు. మన హీరోలు ముందుకొచ్చి వాళ్లకు ఏ కష్టం రాకుండా చూసుకుంటామని హామీ ఇస్తున్నారు. మా కోసం కష్టపడే మీ కోసం ఇప్పుడు మాకు కష్టపడే ఛాన్స్ వచ్చిందంటున్నారు. లాక్ డౌన్ ఎన్ని రోజులు అయినా ఉండనీ.. మీకు అండగా మేమున్నాం.. మీతో పాటే ఉంటామంటున్నారు. చిరంజీవి అధ్యక్షుడిగా ఇప్పటికే కరోనా క్రైసిస్ ఛారిటీ అనేది ఒకటి పెట్టి అందులో కోట్ల రూపాయలు విరాళంగా పొందుతున్నారు. ఇప్పటికే అందులో 8 కోట్ల వరకు విరాళాలు వచ్చాయి కూడా. అయితే ఇప్పుడు సినిమా కార్మికులకు అన్ని అపోలో ఫార్మసిలలో ఉచితంగా మందుల పంపిణి జరుగుతుందని ఉపాసన కొణిదెల ప్రకటించింది. దాంతో కోడలు చేసిన మంచి పనికి చిరంజీవి కూడా అభినందనలు తెలిపాడు. నువ్వు కూడా మా సినిమా కార్మికుల బాధను అర్థం చేసుకుని నీ వంతు సాయం చేసినందుకు చాలా థ్యాంక్స్ కోడలు అంటూ ట్వీట్ చేసాడు మెగాస్టార్. నువ్వు నిజంగా చాలా అద్భుతమైన మనిషివి అంటూ పొగిడేసాడు చిరు. ప్రస్తుతం అపోలో హాస్పిటల్స్ ఉపాధ్యాక్షురాలిగా కొనసాగుతుంది ఉపాసన. అందులోనే పేదలకు కూడా సాయం చేస్తుంది ఈమె. ఇప్పుడు సినిమా కార్మికులకు కూడా తనకు తోచిన సాయం చేస్తుంది మెగా కోడలు.

More Related Stories