పని మొదలెట్టిన సీసీసీ

సినిమా ఇండస్ట్రీలో ఉన్న పేద సంఘటిత కార్మికులని ఆదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి సారథ్యంలో కరోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ) ఏర్పాటైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ఛారిటీకి హీరోలు, దర్శకులు, నిర్మాణ సంస్థలు భారీ ఎత్తున విరాళాలు ఇస్తున్నారు. అయితే అలా ఇవ్వడం ఇష్టం లేని కొందరు తామే నిత్యావసర వస్తువులని కొని వారికి పంచుతున్నారు. ఇక సిసిసి తరపున దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ – దర్శకుల సంఘం అధ్యక్షుడు శంకర్ ల టీం కార్మికులకు నిత్యావసరాల పంపిణీ నిన్నటి నుండి మొదలు పెట్టారు. నిన్నటి నుండీ ఈ పంపిణీ మొదలయింది.
సినిమాలోని 24 శాఖల కార్మికుల్లో రెక్కాడితే కానీ డొక్కాడని వారికి అందరికీ ఈ సరుకుల్ని పంపిణీ చేస్తున్నారు. శంకర్ స్వయంగా సినీ పరిశ్రమలో యూనియన్ లకిచెందినా ప్రతి కార్మికుడి ఇంటికి వెళ్లి వారికి నెలకు సరిపడా బియ్యం, పప్పు, ఉప్పు, ఇతర నిత్యావసర సరుకులని అందిస్తున్నారు. ఇక ఈ విషయం మీద స్పందించిన చిరంజీవి .. సంకల్పానికి సమన్వయం తోడయితే, తోటి కార్మిక సోదరుల కుటుంబాలకి కష్ట సమయంలో భరోసానివ్వగలం అని, అండగా నిలవగలం అని రుజువు చేసిన తెలుగు సినీ పరిశ్రమకి, ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు’’అని ట్వీట్ చేశారు. అలాగే, సినీ కార్మికుడికి నిత్యావసరాలు అందిస్తోన్న శంకర్ ఫొటోను ఆ ట్వీట్లో పొందుపరిచారు. ఇక నిన్న స్టూడియో వర్కర్స్ యూనియన్ కి చెందిన కార్పెంటర్లకి నెలకి సరిపడా నిత్యావసరాలు పంపిణీ చేశారు శంకర్.