English   

తెలుగమ్మాయయినా తెలుగులో అవకాశాల్లేవ్

  Aditi Rao Hydari
2020-04-06 13:00:59

బాలీవుడ్‌లో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న అదితిరావ్ హైదరీ ‘సమ్మోహనం‌’తో టాలీవుడ్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి తాజాగా ‘అంతరిక్షం’తో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయినా ఈ భామకి పెద్దగా గుర్తింపు దక్కలేదనే చెప్పాలి. అయితే ఆ మధ్య ఏకంగా ఆర్ఆర్ఆర్ లోనే ఈ భామ ఛాన్స్ దక్కించుకుందని ప్రచారం అయితే జరిగింది. కానీ అలాంటిది ఏమీ లేదు. ప్రస్తుతం ఈ భామ వి మూవీలో నటిస్తోంది. నాని నెగటివ్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమాలో సుధీర్ బాబు కూడా కీలక రోల్ లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో నానికి సపోర్తివ్ రోల్ లో అదితి కూడా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర పోషించినట్టుగా చెబుతున్నారు. 

బాలీవుడ్ లో – తమిళంలో వరుస సినిమాలతో బిజీగా అవుతున్న హైదరి తెలుగులో మాత్రం అడపాదడపా సినిమాలు తప్ప పెద్దగా ఏమీ చేయలేని పరిస్థితి. మన స్టార్ హీరోయిన్స్ సైతం కుళ్ళుకునేలా ఉన్న  హైదరి ఫిగర్ కి  సరైన పాత్రలు పడట్లేదనే చెప్పాలి. స్టార్  హీరోయిన్స్ లోటు తీర్చడానికి హైదరి సిద్దంగా ఉన్నప్పటికీ అమ్మడు తెలుగు దర్శకుల దృష్టిలో ఎందుకో కానీ పడలేక పోతోంది. హైదరాబాదులో పుట్టి హిందీలో ఫేమస్ అయిన ఈ బ్యూటీ బాలీవుడ్ లో గ్లామరస్ క్యారెక్టర్స్ తో మెల్లగా నెట్టుకొస్తోంది. మరి తెలుగులో ఎప్పుడు ఈ భామకి మంచి క్యారెక్టర్స్ పడతాయో చూడాలి.

More Related Stories