పూరీ రాసే కథ ఆ బాలీవుడ్ హీరో కోసమా..

కరోనా ఎఫెక్ట్‌తో దాదాపు అన్ని దేశాలు లాక్ డౌన్ అయిపోయాయి. ఇక మన ఇండియన్ సినిమాల షూటింగులు కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయిన విషయం తెలిసిందే. దీంతో సినిమా వాళ్లందరూ దాదాపుగా అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ సమయాన్ని ప్రజల్లో కరోనాపై అవగాహన కల్పిస్తూనే కొందరు రెస్ట్ తీసుకుంటున్నారు. మరి కొందరు ఏమో తమ తమ తదుపరి వచ్చే సినిమాలు మీద ద్రుష్టి పెట్టారు. ఇక దర్శకుడు పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేస్తున్న‘ఫైటర్’ మూవీ షూటింగ్ కూడా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో పూరీ కూడా ఇంట్లోనే ఉంటున్నాడు. బ్యాంకాక్ బీచ్‌లలో ఎక్కువగా కథలు రాసుకునే పూరీ జగన్నాథ్ లాక్ డౌన్ పుణ్యమా అని ఇక్కడే ఇంట్లోనే సినిమా కథలు రాసుకుంటున్నాడు.
క్వారంటైన్ సమయంలో పూరీ కొత్త కథ సిద్ధం చేస్తున్న ట్విట్టర్ లో కూడా ప్రకటించాడు. అయితే ఈ కథ మెగా హీరోల కోసం అని కొన్ని పుకార్లు వచ్చినా అందుతున్న సమాచారం ప్రకారం ఓ బాలీవుడ్ యంగ్ హీరోని దృష్టిలో పెట్టుకొని ఆయన ఈ కథ రాసుకుంటున్నాడని అంటున్నారు. ఇప్పటికే బాలీవుడ్ లో ఏకంగా అమితాబ్ లాంటి వారితోనే సినిమా చేసిన పూరీ ఇప్పుడు విజయ్ దేవరకొండతో చేస్తున్న సినిమాని కూడా ప్యాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేయబోతున్నాడు. అందుకే దీని తదుపరి సినిమా ఏకంగా ఒక బాలీవుడ్ హీరోతో చేయడానికి ప్లాన్ చేస్తున్నాడని అంటున్నారు. ఇప్పటికే ఫైటర్ సినిమాకి నిర్మాణ భాగస్వామిగా ఉన్న కరణ్ జోహార్ తో కలిసి బాలీవుడ్ కుర్ర హీరో లీడ్ రోల్ లో ఒక సినిమా ప్లాన్ చేయచ్చని అంటున్నారు. అయితే ఇది ఎంత వరకూ నిజమో తెలియాలి అంటే పూరీ జగన్నాథ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే.